అక్రమంగా ఇసుక తరలిస్తున్న  వాహానం సీజ్

అక్రమంగా ఇసుక తరలిస్తున్న  వాహానం సీజ్

ముద్ర,ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం నారాయణ పూర్ గ్రామా శివారులో  అక్రమంగా ఇసుక తరలిస్తున్న పీకఫ్ ను సీజ్ చేసి రాజన్న పేట గ్రామానికి చెందిన పికప్ వాహానం ఓనర్ శివరాత్రి నరసింహులు పై కేసు నమోదు చేసినట్లు ఎల్లారెడ్డిపేట ఎస్సై శేఖర్ తెలిపారు. శుక్రవారం ఉదయం ఎస్ఐ శేఖర్ కు  వచ్చిన నమ్మదగిన సమాచారంపై నారాయణపురం గ్రామ శివారులో పెట్రోల్ చేస్తుండగా పోలీస్ వాహనానికి ఎదురుగా ఇసుకలోడుతో పికప్ బి ఎన్ టి ఎస్ 23 టి 8993 రాగా దానిని ఆపి అట్టి డ్రైవర్ కు ఇసుక తరలించడానికి అనుమతులు చూపమని అడగగా అతని వద్ద ఎలాంటి అనుమతులు లేవని అక్రమంగా ఇసుక తరలిస్తున్నానని తెలిపి తన పేరు నారాయణపూర్ గ్రామానికి చెందిన శివరాత్రి మహేష్,  పికప్ ఓనర్ రాజన్న పేట గ్రామానికి చెందిన  శివరాత్రి నరసింహులు  ఆదేశాల మేరకు నారాయణపూర్ వాగులో నుండి ఇసుక నింపుకొని దానిని ఎల్లారెడ్డిపేటలో అమ్మడానికి వెళ్తున్నారని చెప్పడం జరిగింది. వెంటనే ఎస్ఐ శేఖర్  పికప్ ను పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చి కేసు నమోదు చేయడం జరిగింది. ఎవరైనా అక్రమంగా ఇసుక తరలిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ శేఖర్ తెలిపారు.