కాంగ్రెస్ జెండాతో నే నకిరేకల్ నియోజకవర్గ ప్రజల జీవితాల్లో వెలుగులు

కాంగ్రెస్ జెండాతో నే నకిరేకల్ నియోజకవర్గ ప్రజల జీవితాల్లో వెలుగులు
  • రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకై ప్రతి ఒక్కరూ కృషి చేయాలి
  • ప్రతీ కార్యకర్త కుటుంబానికి అండగా నిలుస్తాం
  • నకిరేకల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం

ముద్ర ప్రతినిధి, నల్గొండ: కాంగ్రెస్ జెండాతో నకిరేకల్ నియోజకవర్గ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతుందని నకిరేకల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం పేర్కొన్నారు. గురువారం రాత్రి మాజీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నకిరేకల్ పట్టణానికి చెందిన ముఖ్య కార్యకర్తలతో సమావేశంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియెజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమన్నారు. కాంగ్రెస్ పార్టీ మెనీఫెస్టోలో ప్రవేశపెట్టిన మహలక్షీ, గృహ లక్ష్మి, రైతు భరోసా, చేయుత, ఇందిరమ్మ ఇండ్లు, యువవికాసం ప్రజా సంక్షేమ పథకాలని ప్రజలోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. ప్రతీ కార్యకర్త కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తున్నదని భరోసా ఇచ్చారు. సమిష్టిగా అందరం కలిసి ఈ గఢ్ఢ పైన కాంగ్రెసు జెండాను ఏగురవేద్దామని పిలుపునిచ్చారు. నకిరేకల్ మున్సిపాలిటీ లో 20 వార్డులు ఉన్నాయి, ప్రతి ఒక్కరూ తమతమ వార్డులో వచ్చే మెజారిటీ కోసం కృషి చేయాలని కోరారు.