మెదక్ జిల్లా అదనపు కలెక్టర్‌గా వెంకటేశ్వర్లు బాధ్యతలు

మెదక్ జిల్లా అదనపు కలెక్టర్‌గా వెంకటేశ్వర్లు బాధ్యతలు

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లా అదనపు కలెక్టర్  (రెవెన్యూ)గా  జి. వెంకటేశ్వర్లు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. బదిలీపై వెళ్లిన రమేష్ నుండి ఛార్జి తీసుకున్నారు. అంతకుముందు ఆయన కలెక్టర్ రాజర్షి షాను   మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు అదనపు కలెక్టర్ కు స్వాగతం పలికి పరిచయం చేసుకున్నారు.