రానున్న 24 గంటల్లో వనపర్తి జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు ...
- వాతావరణ శాఖ హెచ్చరిక
- వనపర్తి జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
- రెండు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండా
- జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
ముద్ర ప్రతినిధి, వనపర్తి : బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి తూఫానుగా మారినందున వనపర్తి జిల్లాలో రానున్న 48 గంటల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలక్టర్ అధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ముందస్తు చర్యల పై వివిధ శాఖల అధికారులు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. అధికారులు, పంచాయతీ సెక్రటరీలు స్థానికంగా ఉండాలని ఎలాంటి ప్రాణ ఆస్తి నష్టం జరుగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. చెరువులు కుంటలు తెగిపోవడానికి అవకాశం ఉందనే అంచనా ఉన్న వాటిని గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఇరిగేషన్ శాఖ ఇంజనీర్లను ఆదేశించారు. రోడ్లు, కల్వర్టుల పై ప్రత్యేక దృష్టి సారించాలని ఒకవేళ తెగిపోయిన, కల్వర్టులు ఓవర్ ఫ్లో అయిన వెంటనే అటువైపు ఎవరు వెళ్లకుండా బారికెడ్ ఏర్పాటు చేసి సిబ్బందిని ఉంచాలని ఆదేశించారు. శిధిలావస్థలో ఉన్న ఇళ్లను గుర్తించి కుటుంబాలను వెంటనే ఖాలి చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. మత్స్యకారులు మత్స్య వేటకు వెళ్లవద్దని అదేవిధంగా పశువులను మేతకు ఇడవవద్దని ప్రజలను కోరారు.
ముఖ్యంగా కృష్ణ నది పరివాహక గ్రామాలు చింతరెడ్డి పల్లి, ఇర్లదిన్నె, నందిమల్ల, కిష్టంపల్లి, మూలమల్ల, జూరాల, గుంటిపల్లి, మోట్లంపల్లి, కత్తే పల్లి, ఆరేపల్లి, రేచింతల, వైశాగాపూర్, రామమ్మపేట, రంగాపూర్, రాంపూర్, జనుంపల్లి, మునగామాన్ దీన్నే, పెంచికల పాడు, బుర్దిపాడ్, గుమ్మడం, యాపర్ల, గడ్డ బస్వాపురం, పెద్దమారు,చిన్నమారు, బెక్కెం, వెల్తురు, సోలిపూర్, కాలూరు, చెన్నేపాడు గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తుఫాను వల్ల ఏదైనా సమస్యలు వస్తె కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని కంట్రోల్ రూమ్ కు ఫోన్ చేసి సహాయం పొందాలని సూచించారు.
తూఫాన్ కంట్రోల్ రూమ్ *నెం.08545-233525,
08545-220351
అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్, అదనపు కలెక్టర్ రెవెన్యూ యం. నగేష్, ఆర్డీఓ పద్మావతి, జడ్పి సి. ఈ. ఒ యాదయ్య, పి.డి. డి ఆర్ డి ఓ ఉమాదేవి, ఇరిగేషన్ ఈ.ఈ మధుసూదన్ రావు, పంచాయతీ రాజ్ ఈ. ఈ మల్లయ్య, మున్సిపల్ కమిషనర్ పూర్ణ చందర్, డియల్పీఓ రఘునాథ్, ప్రోగ్రాం ఆఫీసర్ సాయినాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.