అక్రమ కేసులతో కాంగ్రెస్ ఆదరణను అడ్డుకోలేరు ఇది ప్రజా విజయం

అక్రమ కేసులతో కాంగ్రెస్ ఆదరణను అడ్డుకోలేరు ఇది ప్రజా విజయం
  • సూర్యాపేటలో బాణాసంచా పేల్చి మిఠాయిలు పంచిన పటేల్ రమేష్ రెడ్డి
  • టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి

ముద్ర ప్రతినిధి సూర్యాపేట: అక్రమ కేసులతో కాంగ్రెస్ పార్టీకి రోజురోజుకు రాష్ట్రంలో పెరుగుతున్న ఆదరణను అడ్డుకోలేరని దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రజాధరణ పెరిగిందని రాహుల్ గాంధీ పై అసత్య ఆరోపణలు చేస్తూ ఎంపీగా అనారత వేటు వేయడాన్ని ప్రతి భారతీయుడు ఖండిస్తున్నాడని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పటేల్ రమేష్ రెడ్డి అన్నారు  శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో బాణాసంచ కాల్చి మిఠాయిలు పంచిన అనంతరం  ఆయన మాట్లాడారు.

మోదీ ఇంటి పేరు వ్యాఖ్యల నేపథ్యంలో సూరత్ కోర్టు విధించిన రెండేళ్ల జైలు శిక్షపై ఏఐసీసీ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీకి  సూరత్ కోర్టు తీర్పుపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడం హర్షించదగ్గ పరిణామం అన్నారు. గరిష్ట శిక్ష విధింపులో ట్రయల్ కోర్టు సరైన కారణం చూపించలేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడిందనీ స్టే ఇవ్వడం జరిగిందని దీంతో రాహుల్ ఎంపీ సభ్యత్వం పునరుద్ధరణకు లైన్ క్లియర్ అయ్యిందనీ ఈ విషయం కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అందరికీ ఒక ఊపును తెచ్చిందని ఇదే ఊపుతో రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన భీమా వ్యక్తం చేశారు. 

ఇది ప్రజా విజయం ముమ్మాటికి కాంగ్రెస్ విజయం అన్నారు. చెడుపై మంచి విజయం సాధించినట్టుగా కేంద్ర ప్రభుత్వంపై రాహుల్ గాంధీ విజయం సాధించారన్నారు. సూరత్ కోర్టు సంబంధించిన కేసును స్టే ఇవ్వడం పై న్యాయం గెలిచిందన్నారు. సుప్రీంకోర్టులో తీర్పు అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నాయి అని చెప్పారు.

ప్రపంచ చరిత్రలో చాలా మంది చక్రవర్తులను చూసిన ప్రజలు తిరగబడి తగలబెట్టిన సందర్భాలు అనేక ఉన్నాయని గుర్తు చేశారు. రాహుల్ గాంధీని మోడీ అనాగరికంగా ఇల్లు కూడా ఖాళీ చేయించడం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రిగా నాయనమ్మ నాన్న చేసినా ప్రభుత్వంలో  రాహుల్ గాంధీ కి కనీసం ఇల్లు లేకపోవడం ఆయన హుందాతనానికి నిదర్శనం అన్నారు. న్యాయవ్యవస్థ మీద గౌరవం ఉండే విధంగా సుప్రీంకోర్టు ఇచ్చిన నిర్ణయాన్ని హర్షిస్తున్నామన్నారు.

సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ సెంటర్లో ఈరోజు బాణాసంచా కాల్చి హర్ష వ్యక్తం చేయడం జరిగిందన్నారు . దేశంలో ఎంత పెద్ద రాజకీయ నాయకులు అయినా ప్రధానమంత్రి కూడా ప్రజా వ్యతిరేక విధానాల అవలంబిస్తే బాధితులకు న్యాయం చేస్తామని దానికి ఏదో ఒక నిదర్శనంగా భావిస్తూ దీనినే అందరం కూడా స్వాగతిస్తున్నాం అన్నారు.

ఇప్పటికైనా ఇమీడియట్ గా రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని పునరుద్ధరించి ఆయనకి వెంటనే ఇల్లును కేటాయించాలని ఎంపీగా అనుమతించాలని స్పీకర్ ఈ విషయంలో వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు  పేద ప్రజల కోసం పోరాటం చేస్తున్న రాహుల్ గాంధీ వెంటనే ప్రజలంతా ఉన్నారన్నారు. ఈ దేశాన్ని లూటి చేస్తున్న  ప్రధాని కి  వ్యతిరేకంగా పోరాటం  చేసిన రాహుల్ గాంధీ పై అక్రమ కేసులు పెట్టడం సరికాదని  ప్రజలందరినీ  మోడీ  క్షమాపణ చెప్పాలనీ, పార్లమెంటు సభ్యత్వాన్ని పునరుద్ధరించాలి డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పెద్దిరెడ్డి రాజా ముదిరెడ్డి రమణారెడ్డి గోదల రంగారెడ్డి షఫీ ఉల్లా శ నగని రాంబాబు నేరెళ్ల మధు గౌడ్ నామ వేణు దాసాయిగూడెం బాబు సాజిద్ ఖాన్ ఫారుక్ గోపగానిగిరి సామ ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు