ఈవియం గోడౌన్ వద్ద అప్రమత్తంగా ఉండాలి జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్

ఈవియం గోడౌన్ వద్ద అప్రమత్తంగా ఉండాలి జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్

ముద్ర ప్రతినిధి కరీంనగర్ : ఈవియం గోడౌన్ వద్ద గార్డ్స్ నిరంతరం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ వద్ద నున్న ఈవిఎం యంత్రాలు, వివి ప్యాట్ భధ్రపరచు  గోడౌన్ ను రెవిన్యూ శాఖ ఎన్నికల విభాగం అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి అయన  పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ ఈవిఎంల రక్షణ, భధ్రతకు సంబంధించిన ఏర్పాట్లను గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల సంఘం మార్గనిర్ధేశాల మేరకు ఎప్పటికప్పుడు ఈవిఎం, వివిప్యాట్ గోడౌన్ ను క్షుణ్ణంగా తనిఖీచేసి సమగ్ర నివేదికను పంపిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈవిఎం గోడౌన్ వద్ద సిబ్బంది హాజరు తీరుపై ఆరా తీస్తూ ఈవిఎం గోడౌన్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ గార్డులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. 
  
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జీవి శ్యాం ప్రసాద్ లాల్, ఆర్డీఓ ఆనంద్ కుమార్, డిప్యూటీ తహసీల్దార్ఎలక్షన్ తహసీన్,  బిఆర్ఎస్ పార్టీ ప్రతినిధి సత్తినేని శ్రీనివాస్, బిజేపి పార్టీ ప్రతినిధి బండ రమణా రెడ్డి, సిపిఐ యం పార్టీ ప్రతినిధి మిట్కూరి వాసుదేవరెడ్డి, సిపిఐ కసిరెడ్డి సురేందర్ రెడ్డి,టిడిపి పార్టీ ప్రతినిధి కళ్యాడపు అగయ్య తదితరులు పాల్గొన్నారు.