వికారాబాద్ లో బీఆర్ఎస్ లో చేరిన బిజెపి, కాంగ్రెస్ నాయకులు

వికారాబాద్ లో బీఆర్ఎస్ లో చేరిన బిజెపి, కాంగ్రెస్ నాయకులు

ముద్ర ప్రతినిధి ,వికారాబాద్: వికారాబాద్ జిల్లా,  బీ ఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సమక్షంలో మంగళవారం వికారాబాద్ మండల పరిధిలోని కొటాలగూడ గ్రామానికి చెందిన బీ జేపీ సీనియర్ నాయకులు *యాదగిరి, వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని అనంతగిరిపల్లికి చెందిన బీ జేపీ, కాంగ్రెస్ పార్టీల నుండి యువనాయకులు ప్రేమ్ చంద్, పవన్, అభిలాష్, విష్ణు, వంశీ క్రిష్ణ, బాల్ రాజ్, యాదయ్య వారి అనుచరులు 30 మంది బీఆర్ఎస్ పార్టీ లో చేరారు. ఎమ్మెల్యే  వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.