వివో ఏ లా సమస్యలను పరిష్కరించాలి

వివో ఏ లా సమస్యలను పరిష్కరించాలి

ముద్ర ప్రతినిధి,  వనపర్తి:  తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ పేదరిక నిర్మూలన కోసం గ్రామ సంఘాల సహాయకులుగా పనిచేస్తున్న ఐకెపి వివోఏ సమస్యలు పరిష్కరించాలని,  వారి న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేస్తున్న నిరవధిక సమ్మెను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కిసాన్ కాంగ్రెస్ వనపర్తి జిల్లా అధ్యక్షుడు వేముల శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. వనపర్తి జిల్లా కొత్తకోట లోని ఐకెపి కార్యాలయం ఎదుట నిరవధిక సమ్మెలో గురువారం ఆయన పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 17600 మందితో గ్రామాలలో వివోఏ లా చేత వెట్టిచాకిరి చేయిస్తుందని వీరికి కష్టానికి పడ్డ ఫలితం దక్కడం లేదని,  కేవలం 3900 మాత్రమే గౌరవార్థం ఇస్తున్నారని, కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని, ఐకెపి వివో ఏ లను సర్ప్ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు.
 అర్హులైన వివో ఏ లను సిసిఓలుగా ప్రమోషన్ కల్పించాలని అన్నారు. 

వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.  వివో ఏ లకు 10 లక్షల సాధారణ భీమా ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని కోరారు.  సమస్యలు పరిష్కరించేంత వరకు కాంగ్రెస్ పార్టీ వారికి అండగా ఉంటామన్నారు.  రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర ప్రభుత్వం వారి న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని  ఆయన డిమాండ్ చేశారు . ఈ కార్యక్రమంలో కిసాన్ కాంగ్రెస్ నాయకుడు  దంతనూరు నాగన్న. ఐకేపీ వివోఏల అధ్యక్షుడు డి.నర్సిహములు.ఉపాధ్యక్షలు.అరుణ, ప్రధాన కార్యదర్శి శ్రీలత, కోశాధికారి శ్రీనివాసులు, పల్లవి,అంజనమ్మ, మంజు లత,శిరీష,శారద, శ్రీ వాణీ, నీరజా,లవ్యణ, పుష్పాలత, శ్రీరీష, తదితరులు పాల్గొన్నారు.