కలెక్టర్ కు అధికారుల ఘన స్వాగతం

కలెక్టర్ కు అధికారుల ఘన స్వాగతం

ముద్ర ప్రతినిధి, నిర్మల్: నిర్మల్ జిల్లా నూతన కలెక్టర్ గా శుక్రవారం హైదరాబాద్ లో విధుల్లో చేరిన ఆశిష్ సంగ్వాన్ శనివారం కార్యాలయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు అడిషనల్ కలెక్టర్ కిషోర్ కుమార్ పూలగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. కార్యాలయ సిబ్బంది కూడా ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం జిల్లా ఎస్పీ ప్రవీణ్ కుమార్ కలెక్టర్ సంగ్వాన్ ను మర్యాద పూర్వకంగా కలిసి పూలగుచ్ఛాన్ని అందజేశారు. అనంతరం ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు సంబంధించి కాసేపు ముచ్చటించారు. ఆర్డీవో, జిల్లా పౌర సంబంధాల అధికారి తిరుమల లు కూడా స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.