ఊట చెరువుల ద్వారా నీటి ఊటలు పెరుగుతాయి

ఊట చెరువుల ద్వారా నీటి ఊటలు పెరుగుతాయి

మెట్‌పల్లి ముద్ర:- ఊట చెరువుల ఏర్పాటు ద్వారా నీటి ఊటలు పెరుగుతాయని. అడివిలో ఉండే జంతువులు పక్షులకు నీటి సౌకర్యం ఉంటుందని రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ శ్రీదేవి, రఘు లు అన్నారు. మండలంలోని ఆత్మనగర్ గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకం క్రింద 6 లక్షల రూపాయలతో నిర్మించిన అమృత్ సరోవర్ ఊట కుంటను పరిశీలించారు. ఊట కుంట నిర్మాణం ద్వారా వర్ష కాలంలో వర్షపు నీటిని వృదా కాకుండా నిలువ ఉంచడంతో చుట్టూ పక్కల రైతులకు మేలుకరంగా ఉంటుందన్నారు. ఊట కుంట నిర్మాణం  అద్భుతంగా ఉందని కొనియాడారు.ఆత్మనగర్ గ్రామ  సర్పంచ్ జరుపుల శ్రీనివాస్,సీనియర్ క్వాలిటీ కంట్రోల్  ఆఫీసర్ రాజేంద్ర ప్రసాద్,జూనియర్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ సీడి ప్రసాద్,  ఏ పి డి,శివాజీ   తిరుపతి రావు, లక్ష్మయ్య, నిజాముద్దీన్
సుమన్ ,మల్లయ్య, గొల్లపల్లి కిషోర్, మెట్ లు, కూలీలు, రైతులు పాల్గొన్నారు.