కాంగ్రెస్ నాయకులపై  దాడులు చేస్తే సహించేది లేదు

కాంగ్రెస్ నాయకులపై  దాడులు చేస్తే సహించేది లేదు

ముద్ర, ఎల్లారెడ్దిపేట : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య వరంగల్ జిల్లాలో యూత్ కాంగ్రెస్ నాయకులపై జరిగిన దాడిని గురువారం ఖండించారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి చేస్తున్న పాదయాత్రను ఓర్వలేక యూత్ కాంగ్రెస్ నాయకులపై దాడి చేయడం బాధాకరమన్నారు.

రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని బిఆర్ఎస్  పార్టీ నాయకులు ఖబర్దార్ అని హెచ్చరించారు.ఈ సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి ,నాయకులు దండు శ్రీనివాసు, గుండాటి రామ్ రెడ్డి,  కొత్తపల్లి దేవయ్య, పందిర్ల శ్రీనివాస్,  చెరుకు ఎల్లయ్య,  శ్రీకాంత్ రెడ్డి ,రాజేందర్  పాల్గొన్నారు.