ఈ లింకు రోడ్లను బాగు చేసేదేపుడో..? ఎన్నికలవేళ, హామీల వర్షం

ఈ లింకు రోడ్లను బాగు చేసేదేపుడో..? ఎన్నికలవేళ, హామీల వర్షం

చండూరు, ముద్ర: చండూరు మండల పరిధిలోని వివిధ గ్రామాలలో ఉన్న లింకు రోడ్లను బాగు చేస్తామని చెప్పి ఎన్నికల ముందు హామీల వర్షం కురిపిస్తారు.గత ప్రభుత్వ హయాంలోకూడా మట్టి రోడ్లను బాగు చేస్తామని నాయకులు చెప్పడం తప్ప నేటికీ ఈ రోడ్ల మరమ్మతులు చేపట్టకపోవడం శోచనీయం. చండూరు మండల పరిధిలోని నేర్మట గ్రామం నుండి బంగారుగడ్డ రోడ్డు ఇంతవరకు బాగు చేయలేదు. మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో ఉన్న లింకు రోడ్లు కూడా "ఎక్కడి వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా " ఉంది. వర్షం వస్తే ఈ రోడ్డు వెంట నడవాలంటే రైతులకు, వాహనదారులకు, పాదాచారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గతంలో రోడ్ల మరమ్మతులు చేపడుతామని అధికారులు, ప్రజా ప్రతినిధులు హామీలిచ్చి, నేటికీ కూడా మరమ్మతు పనులు చేపట్టకపోవడంతో ఈసారి మాత్రం రోడ్లను బాగు చేయకపోతే ఈ అసెంబ్లీ ఎన్నికలలో తగిన బుద్ధి చెప్తామని ప్రజలు బహిర్గతంగానేచర్చించుకుంటున్నారు. చండూరు మండల పరిధిలోని పుల్లెంల నుండి తాస్కానిగూడెం,  బోడంగిపర్తి నుండిచోలేడు, తాస్కానిగూడెంనుండి షిర్ధపల్లి, నేర్మట నుండి లెంకలపల్లి, శేరిగూడెం, తుమ్మలపల్లి నుండి తిమ్మారెడ్డి గూడెం, జోగిగూడెం అదేవిధంగా చండూరు ప్రధాన రహదారి నుండి పడమటితాళ్ల వరకు వర్షం వస్తేఈ రోడ్ల వెంట నడవాలంటేప్రజలు తీవ్ర ఇబ్బందులకుగురవుతున్నారు. ఈ రోడ్లను బాగు చేయాలని ఎన్నోసార్లు ప్రజా ప్రతినిధులకు, అధికారులకు చెప్పినప్పటికీ ఎన్నికల ముందు హామీలు ఇస్తున్నారు గాని ఈ రోడ్లును మాత్రం బాగు చేయడం లేదు. ఈసారైనా ఈ రోడ్ల మరమ్మతులు చేపట్టాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.