సంబరాలు ఎందుకు నిర్వహిస్తున్నారు

సంబరాలు ఎందుకు నిర్వహిస్తున్నారు
  • వేదికపైనే నిలదీసిన రైతులు
  • ఎమ్మెల్యే కందాల కు చేదు అనుభవం

నేలకొండపల్లి, ముద్ర:  రైతుల పరిస్థితి ఎం బాగుంది...  ధాన్యం  కొనుగోలు చేయడంలేదు... సంబరాలు ఎందుకు నిర్వహిస్తున్నారని పలువురు రైతులు మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శనివారం రైతు దినోత్సవ సభ ను ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం మండ్రాజుపల్లి గ్రామ రైతువేధిక లో  నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి హాజరయ్యారు. రైతు సంక్షేమం గురించి మాట్లాడారు. సంబరాలు ఎందుకు నిర్వహిస్తున్నారంటూ వేదికపైనే  రైతులు ఎమ్మెల్యే ని నిలదీశారు. కొద్ది సేపు అక్కడ గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అనంతరం అక్కడ నుంచి ఎమ్మెల్యే వెళ్లిపోయారు.