ఆహారం కొరకు అలమటిస్తున్న మూగజీవాలు...

ఆహారం కొరకు అలమటిస్తున్న మూగజీవాలు...
wild animals starving for food

రోజు రోజుకు పెరుగుతున్న కాలుష్యంతో ఆహారానికి సంబంధించిన చెట్లు లేకపోవడం వల్ల మూగజీవాలు ఆహారం కొరకు అలమటిస్తూ కనిపిస్తున్నాయి. ఆహారం కొరకు కోతులు కుక్కలు పక్షులు విలవిలలాడుతూ నోరులేని స్థితిలో ఎవరికి చెప్పలేక ఎవరికి సహాయాన్ని అడగలేక ఆకలితో అలమటిస్తూ అరుపులు అరుస్తూ వేదన పడుతుంటాయి. రోడ్లపైన ఇటీవల మనము చూస్తుంటే వానరాలు కోతులు కుక్కలు పక్షులు వాహనదారులకు రోడ్ల పైన కనిపిస్తూ ఉండడానికి గమనిస్తూనే ఉన్నాం. దానికి కారణం ఎవరైనా మానవతామూర్తులు తమకు ఆహారాన్ని అందిస్తాయని ఆశతో రోడ్లపైకి వచ్చి తిరుగుతుంటాయి. ప్రపంచంలోకెల్లా మనిషి జన్మ చాలా గొప్ప జన్మ కష్టపడి పని చేసుకుని ఆహారాన్ని తినడానికి కాళ్లు చేతులు సృష్టిలో భగవంతుడు కల్పించాడు అందులో భాగంగా మనిషికి మనసు మేధస్సు తెలివితేటలు సహాయం చేసే గుణం మానవత్వం అన్ని కలగలిపి ఉన్నది ఒక్క మానవ జన్మనే. కాబట్టి ప్రతి ఒక్క మనిషి మానవతా దృక్పథంతో తోటి ప్రాణులకు నోరులేని మూగజీవాలకు ఎంతో కొంత సహాయాన్ని ఆహారాన్ని అందించి ఈ జన్మకు సార్ధకం తీసుకురావాలని మనిషి కోరుకుంటాడు.

పుణ్యక్షేత్రాలు తీర్థయాత్రలకు వెళ్లి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టడమే కాకుండా ఇలాంటి మూగజీవాలకు జంతువులకు పక్షులకు తమకు తోచిన సహాయాన్ని ఆహారాన్ని అందిస్తే ఆ దేవుడి అనుగ్రహం ఇక్కడే లభిస్తుంది. అయితే పూర్వము కోతులు అడవులలో ప్రత్యేకంగా దేవాలయాలలో మాత్రమే కనిపించేవి కానీ ప్రస్తుత పరిస్థితులలో పూర్తిగా గ్రానైట్‌ మాఫియా తోటి గుట్టలు చెట్లు బాంబు బ్లాస్టింగ్లతో అంతరించిపోయి పూర్తిగా కాలుష్యంగా  మారి పర్యావరణం దెబ్బతింటుంది. దానితో పచ్చని చెట్లు పండ్ల చెట్లు అంతరించిపోయి కోతులకు పక్షులకు ఆహారం లేకుండా పోయింది. కోతులు పక్షులు వాటికి ఆహారం లేకపోవడంతో ప్రధాన రహదారిలో రోడ్లపైకి వచ్చి వాహనదారులు ఏమైనా ఆహారాన్ని అందిస్తాయని తిరుగుతుంటాయి. ఇందులో భాగంగా జగిత్యాల జిల్లా కొండగట్టు పుణ్యక్షేత్రం పరిసర ప్రాంతాలలో కరీంనగర్‌ కొండగట్టు జగిత్యాల ప్రధాన రహదారిలో చాలా రోజుల నుండి రోడ్లపై పోతులు ఉండడానికి వాహనదారులు ప్రతినిత్యం చూస్తూనే ఉన్నారు. వాటికి కొందరు ముందుగానే మానవతా హృదయంతో అరటి పండ్లు ఇతర పండ్లు వాటికి సంబంధించిన తినే ఆహారాన్ని వారి వాహనాలలో తీసుకుని వచ్చి రోడ్డుకు ఇరువైపులా వేస్తూ వెళుతుంటారు మానవత్వంతో వేసిన ఆహారమే వాటికి తినడానికి దొరుకుతుంది కానీ ఇంతవరకు సరిపోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. అదేవిధంగా గ్రామాలలో ఊర కుక్కలు వాటికి ఆహారం లేక విలవిలలాడుతున్నాయి గతంలో పూర్వము నుండి గ్రామాల్లో కుక్కలు గ్రామంలో దొంగలు ప్రవేశించిన ఎవరైనా చనిపోయిన అనర్ధాలకు గురైన సంఘటనలు అవి పసిగట్టి మేధాశక్తి ద్వారా గమనించి అరుస్తూ ఉండడాన్ని చూసే ఉన్నాం. ఇప్పటికీ కొన్ని జాతుల వాళ్ళు గొల్ల కురుమ కులస్తులు గంగిరెద్దుల వాళ్ల వాళ్ళ సామగ్రిని కాపాడేందుకు కుక్కలను పెంచుకుంటారు అవి ఎంతో రక్షణగా వారికి విశ్వాసం కొద్ది ఉంటుంటాయి జంతువులలో అతి ఎక్కువ విశ్వాసం గల జంతువు కుక్క మాత్రమే. ఎప్పటికీ పోలీసులు ప్రత్యేక ఇన్వెస్టిగేషన్లో కుక్కలను సహాయం తీసుకుని కేసులను పరిశోధిస్తుంటారు అలాంటి అంత విలువైన కుక్కలకు గ్రామాలలో ఆహారం లేకుండా పోయింది.

పూర్వం ఇంటి పరిసర ప్రాంతాలలో మిగిలిన ఆహార పదార్థాలను వేస్తే ఊర కుక్కలు తిని వాటి జీవనాన్ని కొనసాగించేవి.గ్రామాలలో సిసి రోడ్లు గ్రామపంచాయతీ వాళ్లు ఇచ్చిన తడి చెత్త పొడి చెత్త బుట్టలలో మిగిలిన అన్నం ఆహార పదార్థాలు వేసి గ్రామపంచాయతీ బండిలో వేయడంతో ఇంటి పరిసర ప్రాంతాలలో ఆహార పదార్థాలు దొరకక ఖాళీ కడుపుతో అలమటిస్తూ రోడ్ల పైన తిరుగుతూ కనిపిస్తుంటాయి. ఏ విధంగా ఏమైనా ఇండ్లలో ఫంక్షన్‌ జరిగితే ఇస్తరాకులు ఇంటి బయట పడవేస్తే మిగిలిన ఆహారాన్ని కుక్కలు తినేటివి కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఫంక్షన్‌ హాల్‌ లో ముందుగానే ఏర్పాటు చేసిన డ్రంళ్లలో ప్లేట్లు వేయడంతో మిగిలిన ఆహారం వాటికి దొరకక పోవడం వల్ల వచ్చి పోయే వారిని దీనంగా చూస్తున్న కుక్కలు ఫంక్షన్‌ హాల్ల ముందు ఎన్నో కనిపిస్తుంటాయి.లక్షలాది రూపాయలు పెట్టి ఫంక్షన్లు చేస్తుంటారు.. కానీ కనీసం మిగిలిన అన్నాన్ని అయినా వాటికి పెట్టకపోవడం వారి మానవత్వం అక్కడ కనిపిస్తుంది. కొంతమంది మానవతా హృదయంతో సహాయం చేస్తున్నారు. మన తోటి ఉన్న కోతులు కుక్కలు పక్షులు ఇతరత్రా మూగ జీవులాకు ఆహారాన్ని అందించి తమ మానవత్వాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.