తుంగతుర్తి నుండి ఓయూ నేత పిడమర్తి రవి పోటీ చేస్తారా?

తుంగతుర్తి నుండి ఓయూ నేత పిడమర్తి రవి పోటీ చేస్తారా?
  • కాంగ్రెస్ టికెట్ పిడమర్తి కి దక్కనుందా?


తుంగతుర్తి ముద్ర:తుంగతుర్తి నియోజకవర్గం నుండి రానున్న ఎన్నికల్లో పోటీకి తాను సైతం సిద్ధం అంటున్న ఓయూ ఉద్యమకారుడు, మాజీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పిడమర్తి రవి కామెంట్స్ తో నియోజకవర్గం వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది . ఇటీవల తుంగతుర్తి నియోజకవర్గంలోని అరవపల్లి మోత్కూరు మండలాల్లో తన సన్నిహితులతో కలిసి తాను పోటీకి సిద్ధమనే సంకేతాలు పంపినట్లు సమాచారం. పిడమర్తి రవి పోటీ చేస్తే పరిణామాలు ఎలా ఉంటాయని దానిపై నియోజకవర్గంలో సర్వత్ర చర్చ నడుస్తుంది.  ఇప్పటికే నియోజకవర్గంలో స్థానికంగా కొందరు, స్థానికేతర్లు కొందరు తమకే తుంగతుర్తి కాంగ్రెస్ టికెట్ అని ఆశ భావం వ్యక్తం చేస్తూ ఉండగా, తాజాగా పిడమర్తి రవి పేరు సంచలనాత్మకంగా తెర మీదకు వస్తోంది. ఇందుకు ప్రధానంగా ఖమ్మం జిల్లాకు చెందిన బలమైన నాయకుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తాను కాంగ్రెస్ లోకి రావాలంటే పార్టీ నుండి తన అనుయాయులకు కొంతమందికి పోటీకి టికెట్ ఇవ్వాలని, కాంగ్రెస్ అధిష్టానాన్ని కోరడం అందులో తుంగతుర్తి నుండి పిడమర్తి రవికి టికెట్ ఇవ్వాలని కోరుతున్నట్లు సమాచారం. ఇదే నిజమైతే, ఇప్పటికే టికెట్ ఆశిస్తున్న వారు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు పిడమర్తి రవికి మద్దతు ఇస్తారా ?ముఖ్యంగా, నియోజకవర్గంలో పట్టు ఉన్న మాజీ మంత్రి దామోదర్ రెడ్డి ఆశీస్సులు పిడమర్తి రవి కుంటాయా? రానున్న కొద్ది రోజుల్లోనే ఈ విషయంపై క్లారిటీ వస్తుందనే మాట వినవస్తోంది. ఏది ఏమైనా తుంగతుర్తి నుండి పిడమర్తి రవి పోటీ చేస్తారా అనే మాట సర్వత్ర సంచలనం సృష్టిస్తోంది.