సెప్టెంబర్ నుంచి విశాఖలోనే ఉంటా: జగన్
సెప్టెంబర్ నుంచి విశాఖలోనే ఉంటానన్న ఏపీ సీఎం జగన్. ఎవరెన్ని కుట్రలు చేసినా మీ బిడ్డను ఎవరూ ఏమీ చేయలేరన్న వైఎస్ జగన్. టీడీపీ హయాంలో భోగాపురం ప్రాజెక్టు ఎందుకు ముందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. సుప్రీం కోర్టు, ఎన్జీటీలో కేసులు వేసి అడ్డంకులు సృష్టించారు. కేంద్రం నుంచి అన్ని అనుమతులు తీసుకొచ్చి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశామన్న జగన్. ఇవన్నీ పూర్తికాకుండానే గతంలో ఎన్నకల ముందు టెంకాయ కొట్టారు. మీ బిడ్డ దేవుడి దయ, మీ ఆశీస్సులనే నమ్ముకున్నాడు. ఒకవైపు పేదవాడి ప్రభుత్వం ఉంటే, పెత్తందార్లకు వంతపాడే పార్టీ ఉందన్నారు. గతంలో ఉన్న చంద్రబాబు పాలన, ఇప్పుడున్న పాలనను గమనించండి. మీకు మంచి జరిగితే నన్ను ఆశీర్వదించండి అని అన్నారు.