ముగిసిన వైన్స్ టెండర్ల ప్రక్రియ...

ముగిసిన వైన్స్ టెండర్ల ప్రక్రియ...
  • జిల్లాలో భారీగా టెండర్ల నమోదు...
  •  82 షాపులకు గాను 3970 టెండర్లు..
  •  79 కోట్ల 40 లక్షల ఆదాయం...

ముద్ర ప్రతినిధి భువనగిరి :యాదాద్రి భువనగిరి జిల్లాలో వైన్స్ టెండర్ ప్రక్రియ ముగిసింది. జిల్లాలోని  అన్ని మున్సిపాలిటీలు, గ్రామాలలో 82 షాపుల గాను  3970 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ శాఖ జిల్లా సూపరిండెంట్  నవీన్ కుమార్  తెలిపారు. 3970 దరఖాస్తులతో 79 కోట్ల 40 లక్షల ఆదాయం వచ్చినట్లు చెప్పారు.  జిల్లాలోని భువనగిరి మున్సిపాలిటీ,  మండలం, బీబీనగర్ మండలం, పోచంపల్లి మున్సిపాలిటీ, మండలం, రామన్నపేట మండలం, చౌటుప్పల్ మున్సిపాలిటీ, మండలం, నారాయణపురం మండలం, యాదగిరిగుట్ట మున్సిపాలిటీ, మండలం, ఆలేరు మున్సిపాలిటీ, మండలం, మోట కొండూరు మండలం,  ఎం తుర్కపల్లి  మండలం, రాజాపేట మండలం   గ్రామాలలోని వైన్ షాపులకుటెండర్ ధరఖాస్తులు స్వీకరించారు. దరఖాస్తులను పరిశీలించి ఈనెల 21న  సోమవారం రాయగిరి లోని  సోమ రాధాకృష్ణ  ఫంక్షన్ హాల్ లో ఉదయం 10:30 కు  డ్రా ద్వారా ఎంపిక చేస్తున్నట్లు చెప్పారు.