మంచిర్యాల లో మహిళను నరికి చంపిన దుండగులు

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల: మంచిర్యాల పురపాలక సంఘం కార్యాలయం ముందు మహిళ దారుణ హత్యకు గురయ్యారు. పట్టపగలు అందరూ చూస్తుండగా హత్య జరిగింది. మధ్యాహ్నం సమయంలో ద్విచక్రవాహనంపై వచ్చిన ముగ్గురు వ్యక్తులు మహిళను కత్తులతో నరికి చంపారు. ముఖం, తలపై తీవ్రంగా గాయాలుకావడంతో  ఘటనా స్థలంలో మృతి చెందింది. పోలీసులు ఘటనా స్థలంకు చేరుకుని విచారణ జరుపుతున్నారు. మహిళ ఎవరో ఇంకా గుర్తించలేదు. హత్య ఎందుకు జరిగిందనే కోణంలో పోలీస్ లు విచారణ జరుపుతున్నారు.