పట్టణాల్లో ఉపాధి హామీ పథకం అమలు చేయాలని -కలెక్టరేట్ ఎదుట కూలీల నిరసన

పట్టణాల్లో ఉపాధి హామీ పథకం అమలు చేయాలని -కలెక్టరేట్ ఎదుట కూలీల నిరసన

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: పట్టణాల్లో ఉపాధి హామీ పథకం అమలు చేయాలని అసంఘటిత కూలీ బిడ్డల సంఘం కార్మికుల అధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు.
 అనంతరం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాన్ని సమర్పించారు.ఈ  సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్, పట్టణ పరిధిలో ఉపాధి హామీ పథకమును రద్దు చేసారని. ఇది వరకు మున్సిపాలిటి పరిధి గ్రామాలలో ఉన్న అనేక మంది ఉపాధి హామీ పథకముపై ఆధారపడి తమ తమ కుటుంబాలను పోషించుకొనేవారని అన్నారు. వ్యవసాయంలో రైతులు, రైతు కూలీలు నెల రోజుల పాటు పనులు చేస్తూ సంవత్సరం గ్రాసం ఏర్పాటు చేసుకునేవారని. అలాంటి వ్యవసాయంలో యంత్రాలు రావడంతో కార్మికులకు పనులు లేకుండా పోయాయన్నారు. దీనితో తమ కుటుంబాలు పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడిందని, తమ గ్రామాలు మున్సిపాలిటిలలో కలిపిన నాటినుండి  ప్రభుత్వానికి కట్టె పన్నులు పెరిగిపోయాయని,  
ఉపాధి పనులు లేక ఇతర ప్రత్యేన్మయ పనులు లేక ప్రజలు చాలా ఇబ్బందులకు గురౌతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.దేశంలోని 5రాష్ట్రాలు కేరళ, మధ్యప్రదేశ్, హిమాచలప్రదేష్, ఓరిస్సా, జార్ఖండ్ రాష్ట్రాలలో అమలు అవుతున్న మాదిరిగా మన రాష్ట్రంలోని మున్సిపాలిటి, పట్టణాలలో  ఉపాధి హామీ పనులు కల్పించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.