అన్నదాతల ఆర్థిక అభివృద్ధికి కృషి

అన్నదాతల ఆర్థిక అభివృద్ధికి కృషి
  • 67.10 లక్షల రుణాలు రైతులకు అందజేత
  • సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి

ముద్ర,ఎల్లారెడ్డిపేట :అన్నదాతల ఆర్థిక అభివృద్ధికి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కృషి చేస్తుందని 67.10 లక్షలు 12 మంది లబ్ధిదారులకు మంజూరైనట్లు శుక్రవారం పేర్కొన్నారు. మంజూరైన రుణాలను లబ్ధిదారులు  చిందు మల్లయ్య, గోగూరి ప్రభాకర్, గంట శ్రీనివాస్, రాగుల ఎల్లారెడ్డి, నాగుల పరుశరాములు, చిందు శంకర్, ఊసి ఎల్లయ్య,బిపేట బాజయ్య, మీసం రాజం, ఎనగందుల సత్యనారాయణ, కొప్పు నర్సింలు లకు అందజేశారు.  అనంతరం లబ్ధిదారుల సమక్షంలో సింగిల్ విండో అధ్యక్షులు కృష్ణారెడ్డి మాట్లాడుతూ  వ్యవసాయ అనుబంధ రంగాలను అభివృద్ధి పరచడం కొరకు మంత్రి కేటీఆర్, నాప్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు ల సూచన మేరకు దీర్ఘకాలిక రుణాలను పెద్ద ఎత్తున ఎల్లారెడ్డిపేట సహకార సంఘం ఆధ్వర్యంలో పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా రైతులు ఆర్థిక స్వావలంబన తో పాటు దాని అనుబంధ రుణాలు అయిన డైరీ, గొర్రెలు,పట్టుపురుగులు, కోళ్ల పెంపకం, బోరు మోటర్, పైప్ లైను, ట్రాక్టర్,హార్వెస్టర్లకు సహకార సంఘాలు ఇచ్చే దీర్ఘకాలిక రుణాలు పొంది ఆర్థికంగా ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు గోంగూరి ప్రభాకర్ రెడ్డి, మాజీ ఏఎంసీ డైరెక్టర్ ఎలగందుల నర్సింలు, ఎగదండి శ్రీనివాస్, కిషోర్,సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.