రాష్ట్రానికి ఆదర్శంగా పనులు జరగాలి- జిల్లా కలెక్టర్  ప్రశాంత్ జె పాటిల్

రాష్ట్రానికి ఆదర్శంగా పనులు జరగాలి- జిల్లా కలెక్టర్  ప్రశాంత్ జె పాటిల్

సిద్దిపేట, ముద్ర ప్రతినిధి: సిద్దిపేట నియోజకవర్గంలో జరుగుతున్న మన ఊరు మన బడి పథక పనులు రాష్టానికే ఓక దిక్సూచిలా నిలపాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జే పాటిల్ అధికారులకు సూచించారు.మంగళవారం నాడు సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో సిద్దిపేట నియోజకవర్గంలో మన ఊరు మన బడి పథకం కింద చేపట్టిన పనులపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు మండలాల వారీగా ఎంఈవో, ఎంపిడిఒ, ఎపిఓ, ఇంజినీరింగ్ విభాగం ఏఈ, డిఈలు, సర్పంచులు, నిర్మాణ ఏజెన్సీల వారు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ మంత్రి హరీష్ రావు స్వంత నియోజకవర్గం లో జరిగే మన ఊరు మన బడి పథకం పనులు రాష్ట్రానికే దిక్సూచిలా నిలిపేలా పనుల్లో వేగం పెంచి నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. మండలాల వారిగా పాఠశాలల జరుగుతున్న పనుల గూర్చి అధికారులను అడిగి తెలుసుకున్నారు. తడకపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో వేగంగా పూర్తి చేయించాలని కాంట్రాక్టర్కు తెలిపి సుందరికరణ బాధ్యతలను అర్బన్ ఎంపీడీవో సమ్మిరెడ్డి కి బాధ్యత తీసుకోని పెద్ద స్కూల్, మైదానం ఉన్నందున క్రీడలకు సంబంధించిన ప్రతిదీ డెవలప్ చేయాలని తెలియజేశారు. మిట్టపల్లి జిల్లా పరిషత్ పాఠశాల సుందరీ కరణ బాధ్యత మండల ఎంఈఓ, నారాయణరావుపేట జిల్లా పరిషత్ పాఠశాల సుందరీకరణ బాధ్యత మండల ఎంపీఓ కి అప్పగించారు. నంగునూరు మండలంలో పాఠశాలలో పథక పనులు నత్తనడకన సాగుతున్న పంచాయతీరాజ్ ఈఈ పర్యవేక్షణ చేసి పనులు వేగవంతం చేసేలా చర్యలు తిసుకోవాలన్నారు. పాఠశాలలో కిచెన్ షెడ్ లో బియ్యం బస్తాలను నిల్వ చేయడానికి లోపల ఓక మూలన 1ఫీట్ ఎత్తులో గద్దె మాదిరిగా నిర్మించాలన్నారు. మళ్లీ సమావేశం లోపు పనుల్లో వేగం పెంచి త్వరగా పూర్తి చెయ్యాలని అధికారులను ఆదేశించారు.

 సమావేశంలో డీఆర్డీఏ పిడి చంద్రమోహన్ రెడ్డి, పంచాయతీ రాజ్ ఈఈ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.