జవాన్లకు నివాళులర్పించిన యువకులు

జవాన్లకు నివాళులర్పించిన యువకులు

చిగురుమామిడి ముద్ర న్యూస్: జమ్ము కాశ్మీర్ లో జరిగిన ఉగ్రవాదుల దాడిలో వీరమరణం పొందిన ఐదుగురు జవాన్లకు చిగురుమామిడి మండల కేంద్రంలో గ్రామ యువకులు కొవ్వొత్తులతో ఘనంగా నివాళులర్పించారు. అనంతరం చిగురుమామిడి శాంతినగర్ యూత్ అసోసియేషన్, గ్రామ యువకులు మాట్లాడుతూ దేశ రక్షణలో ప్రాణాలర్పించిన వీర సైనికులను ఈ దేశం ఎప్పటికీ మరువదని, సైనికుల త్యాగాలను వృథా పోనీయకుండా వారి స్ఫూర్తితో దేశ రక్షణలో యువత ముందుంటుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉల్లెంగుల శ్రీకాంత్, బుర్ర వెంకటేష్ , పెనుకుల శ్రీనివాస్,పెనుకుల తిరుపతి , కోనేటి అంజి , చిట్టెల మహేష్, పూదరి సాయి,తెరల అమర్, నాగెల్లి హరీష్, గూడెం చందూ, నాగరాజు, తాళ్లపెళ్లి అరవింద్, మామిడి శెట్టి అనిల్, కాటం అనిల్, పాశం సంపత్, కక్కెర్ల రాజు,వంగా రాజు, గడ్డం సంతోష్,గడ్డం నవీన్, పండ్రాల సాగర్, సింగపూర్ శివ, ఉల్లేంగుల వివేక్, పెనుకుల వంశీ, సూర్య మరియ గ్రామ యువకులు పాల్గొన్నారు.