రాష్ట్ర క్రీడా ప్రాంగణాల్లో యువ జాతర

రాష్ట్ర క్రీడా ప్రాంగణాల్లో యువ జాతర

నల్గొండ జిల్లా కేంద్రంలో సీఎం కప్ -2023 పోటీలకు ముఖ్య అతిధిగా హాజరైన శాట్స్ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్

ముద్ర ప్రతినిది, నల్గొండ: నల్గొండ జిల్లా కేంద్రంలోనీ మేకల అభినవ్ స్టేడియంలో జరుగుతున్న జిల్లా స్థాయి సీఎం కప్ -2023 పోటీల సందర్బంగా స్థానిక శాసన సభ్యులు కంచెర్ల భూపాల్ రెడ్డి తో కలసి తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్   మంగళవారం క్రీడా పోటీలు జరుగుతున్న తీరును పర్యవేక్షించారు.ఈ సందర్బంగా మైదాణంలో వివిధ క్రీడా పోటీలలో తలపడుతున్న క్రీడా జట్లను పరిచయం చేసుకున్నారు.
అనంతరం వాలిబాల్ తో పాటు వివిధ క్రీడలు ఆడుతున్న క్రీడాకారులతో కలసి, ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి తో పాటు ఆడి క్రీడాకారులను ఉత్సాహపరిచారు. తదనంతరం, ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి,మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి, గ్రంధాలయం చైర్మన్ రెగట్టే మల్లికార్జున్ రెడ్డి  తో కలసి విలేకర్ల సమావేశంనిర్వహించారు..ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు.


రాష్ట్రము లో సీఎం కప్ కి అద్భుతమైన స్పందన వస్తుంది శాట్స్ ఆధ్వర్యంలో 617 మండల కేంద్రాలలో నాలుగున్నర లక్షల మంది క్రీడాకారులు పాల్గొన్నారు.
రాష్ట్రము లో గడచిన 30ఏళ్ళలో అతిపెద్ద క్రీడా సంబురం.
ఈ నెల 22 నుండి 24 తేదీ వరకు జరిగే జిల్లా స్థాయి సీఎం కప్ పోటీలలో లక్షన్నర మంది 15నుండి 35 ఏళ్ళు గల యువ క్రీడాకారులు పాల్గొంటున్నారు.
రాష్ట్రము లో ఉన్న క్రీడ ప్రాంగణాలు అన్నీ నవతరం తో కళకళ లాడుతున్నాయి.
రాష్ట్ర ముఖ్యమంత్రి  దూరదృష్టి తో గ్రామీణ స్థాయి నుండి జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులను తయారు చేయడమే లక్ష్యం గా క్రీడలను ప్రోత్సహిస్తున్నారు.
దేశంలోనే సీఎం కెసిఆర్  ఎక్కడ లేని విధంగా 17వేల క్రీడా ప్రాణంగానలను నిర్మించారు.
క్రీడా ప్రాంగణాలను యువత కేర్ టెకర్లుగా మారి వాటిని సంరక్షించుకోవాలి.
యువత కుటుంబలతో కలసి క్రీడ ప్రాంగణంలో గడిపి ఆరోగ్యాన్ని, ఆహ్లాదాన్ని పెంపోందించుకోవాలి.

తెలంగాణ ప్రభుత్వ ప్రోత్సాహంతో అంతర్జాతీయ స్థాయి లో నిజామాబాదు కి చెందిన నిఖత్ జరిన్, అదే విధంగా ఈషా సింగ్, కొత్త గూడెం కి చెందిన క్రికెటర్ త్రిష, మొన్నటికి మొన్న చెస్ లో గ్రాండ్ మాస్టర్ గా నిలిచిన ఆదిత్య లాంటి వారు అద్భుతమైన విజయాలు సాధిస్తున్నారు.
దేశంలో ఎక్కడ లేని విధంగా క్రీడాకారులకు జూబ్లీహిల్స్ లాంటి ప్రాంతాలలో ఖరిదైనా 600గజాల ఇళ్ల స్థలాలు, అత్యున్నత నగదు పురస్కారాలు ఇస్తూ క్రీడాకారులను ప్రోత్సాహిస్తున్నారు .వ్యవసాయ, సాగు, అన్నీ రకాల రంగాలను దేశానికి గౌరవ సీఎం  మోడల్ గా నిలపారు.. భవిష్యత్తులో కూడ తెలంగాణ ప్రభుత్వం క్రీడలను తెలంగాణ మోడల్ గా నిలవబోతుంది.
ఈ కార్యక్రమం లో నల్గొండ మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి, జిల్లా గ్రంధాలయ చైర్మన్ రెగట్టే మల్లికార్జున్ రెడ్డి, డివైఎస్ మహమ్మద్ మగ్గ్బుల్, స్థానిక ప్రజా ప్రతినిధులు, వేలాది మంది క్రీడాకారులు, పిఈటిలు, కోచ్ లు పాల్గొన్నారు.