చంద్రబాబు పై తీవ్ర విమర్శలు చేసిన వైఎస్‌ జగన్‌

చంద్రబాబు పై తీవ్ర విమర్శలు చేసిన వైఎస్‌ జగన్‌

ముద్ర,ఆంధ్రప్రదేశ్:- వైఎస్‌ జగన్‌ చంద్రబాబు పై తీవ్ర విమర్శలు చేశారు. ఆదివారం తిరుపతి జిల్లా వెంకటగిరిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో జగన్‌ మాట్లాడారు. ఎన్నికల్లో చంద్రబాబు సాధ్యం కాని హామీలతో మరోసారి మోసం చేస్తున్నారని, బాబును నమ్మడమంటే పులినోట్లో తలకాయ పెట్టినట్లేనని ఆరోపించారు. వైసీపీ అమలు చేసిన పథకాలు కొనసాగాలంటే వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ  తిరిగి అధికారంలోకి రావాలని, చంద్రబాబుకు వేస్తే పథకాలు ముగింపు అవుతాయని పేర్కొన్నారు.