ఘనంగా రాజశేఖర్ జయంతి

ఘనంగా రాజశేఖర్ జయంతి

ముద్ర, ప్రతినిధి, మంచిర్యాల : దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతి వేడుకలు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. శనివారం మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నివాసంలో నేతలు కేక్ కట్ చేశారు. అనంతరం రాజశేఖర్ రెడ్డి చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈసందర్భంగా కాంగ్రెస్ నేతలు మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి సుపరిపాలన అందించారని గుర్తు చేశారు. ఆరోగ్య శ్రీ, ఫీజురీయింబర్స్ మెంట్, జలయజ్ఞం తదితర పథకాలు అమలు చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి చిట్ల సత్యనారాయణ, పీసీసీ సభ్యుడు కొండా చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.