ప్రజల పక్షపాతి వైఎస్సార్

ప్రజల పక్షపాతి వైఎస్సార్
  • టీపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ 
  • షాద్ నగర్ లో ఘనంగా వైఎస్ఆర్ వర్ధంతి 

ప్రజల పక్షపాతి వైఎస్సార్ అని, ప్రజా సంక్షేమం కోసం వైఎస్ఆర్ ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల వల్ల అనేక మంది ప్రజలు లబ్ది పొందారని టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ కొనియాడారు.తెలుగు రాష్ట్రాలు లలో సంక్షేమానికి నిలువెత్తు రూపం గా  కీర్తిశేషులు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి నిలిచారని ఆయన అన్నారు.

 శనివారం షాద్నగర్ ముఖ్య కూడలిలో డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నివాళులు అర్పించారు.
 అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..

నా అనుకున్న వాళ్ల కోసం ఎంతవరకైనా వెళ్లే గొప్ప వ్యక్తిత్వం డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డిదనీ అన్నారు. అనుకున్నది సాధించడానికి ఎన్ని సవాళ్లనైనా ఎదుర్కొనే ధైర్యం ఆయన నైజం. ఆయన నవ్వుతూ ఉండేవాడనీ కార్యకర్తలను కూడా నవ్వుతూ ఉండమనేవారనీ అన్నారు. సంక్షేమలో ఎన్టీఆర్ను మరిపించిన ఘనత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి అని అన్నారు. నా లాంటి ఎందరికో రాయకీయ పునాదులు వేసిన నాయకుడు

ఈ కార్యక్రమంలో ఆయా మండలాల అధ్యక్షులు టౌన్ ప్రెసిడెంట్లు బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పీసీసీ మెంబర్లు యూత్ కాంగ్రెస్ ఎన్ ఎస్ సి ఐ మహిళా కాంగ్రెస్ కిసాన్ కాంగ్రెస్ మైనార్టీ సెల్ ఎస్టీసెల్ బీసీ సెల్ మరియు సర్పంచులు కౌన్సిలర్లు ఎంపిటిసిలు కాంగ్రెస్ అనుబంధ సంఘాలు  ఎత్తున పాల్గొన్నారు.

వైయస్సార్ వర్ధంతి సందర్భంగా ఆసుపత్రిలో రోగులకు పండ్లు బ్రేడ్లు పంపిణీ చేసిన వైయస్ఆర్ టిపి పార్టీ నాయకులు

ముద్ర, షాద్‌నగర్: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర్ రెడ్డి సేవలు చిరస్మరణీయమని, ఆయన చేసిన సేవలను ఎన్నటికీ మరువలేమని వైఎస్ఆర్టీపీ పార్టీ షాద్ నగర్ కోఆర్డినేటర్ ఎండి ఇబ్రహీం అన్నారు.

 శనివారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి 14వ వర్ధంతిని పురస్కరించుకొని వైయస్ఆర్టిపి  పార్టీ కోఆర్డినేటర్ ఎండి ఇబ్రహీం  ఆధ్వర్యంలో షాద్ నగర్ ముఖ్య కూడలిలోని వైయస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి పార్టీ నాయకులు ఘన నివాళులు అర్పించారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు, బ్రెడ్లు అందజేశారు.

 ఈ సందర్భంగా ఎండి ఇబ్రహీం మాట్లాడుతూ... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ అందించిన సేవలు చిరస్మరణీయమని బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. 108, ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ వంటి పథకాలతో  ఎంతోమందికి ఉపయోగం చేకూరిందని ఆయన గుర్తు చేశారు. డాక్టర్ వైఎస్ఆర్ పాలనలో అన్ని వర్గాల వారు అభివృద్ధి చెందారని అన్నారు. వైఎస్ఆర్ తనయ వైయస్ షర్మిలమ్మ సైతం ఆయన అడుగుజాడల్లోనే నడుస్తూ బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం కృషి చేస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు బొబ్బిలి సుధాకర్ రెడ్డి, వైయస్ఆర్ టీపీ యువజన నాయకుడు శీలం శీను, మహిళ నాయకురాలు రమాదేవి, ఆయా మండలాల పార్టీ అధ్యక్షులు,  నందిగామ మండల ప్రెసిడెంట్ ఈదులపల్లి నరసింహ టౌన్ ప్రెసిడెంట్ డేవిడ్ రాజ్,  కొత్తూరు మండల ప్రెసిడెంట్ బూస జంగన్న ఫరక్ నగర్ మండల ప్రజెంట్ గోపి నాయక్ కొందుర్గు మండల ప్రెసిడెంట్ మహేంద్ర, ప్రెసిడెంట్ వెంకటేష్,  సత్యం, రాము, ప్రకాష్ చారి,సుదర్శన్,బిక్షపతి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.