బిఆర్ ఎస్ కు షాక్ బుగ్గారం జడ్పిటిసి, ఎంపిపీ రాజీనామా 

బిఆర్ ఎస్ కు షాక్ బుగ్గారం జడ్పిటిసి, ఎంపిపీ రాజీనామా 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: బిఆర్ ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది.  ధర్మపురి నియోజకవర్గ పరిధిలోని బుగ్గారం జెడ్పిటీసి బాదినేని రాజేందర్, ఎంపీపీ రాజమణితో పాటు వైస్ ఎంపీపీ జోగినిపెళ్లి సుచెంధర్, పెంబట్ల విండో చైర్మన్ గుర్నాథం మల్లారెడ్డిలు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. జగిత్యాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధినేని రాజేందర్ మాట్లాడతూ పార్టీ ప్రారంభం నుండి కెసిఅర్ గెలవాలని, తెలంగాణ వాదం నిలవాలని బీఆర్ఎస్ పార్టీ కోసం ఎంతో కృషి చేశామన్నారు.

తెలంగాణ సాధనలో భాగస్వామ్యం అయి పార్టీ పిలుపు మేరకు అన్ని రకాల కార్యక్రమాలు చేశామని పార్టీ మమ్మల్ని అణిచివేతకు గురి చేసి చిన్న చూపు చూసిందని ఆరోపించారు.  కొప్పుల ఈశ్వర్ కు ఎంతో సపోర్ట్ చేసి గెలుపు కోసం కృషి చేసిన ఆయన కూడా మమ్మల్ని చిన్న చూపు చూసినట్లు అనిపించిందన్నారు. ప్రజలు, మా కార్యకర్తల కోరిక మేరకు పార్టీ కి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నామని ప్రకటించారు. తర్వాతి కార్యాచరణ త్వరలోని ప్రకటిస్తామని తెలిపారు.