కోరుట్ల, ముద్ర విలేకరి: కోరుట్ల పట్టణంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు తిరుమల గంగాధర్ ఆధ్వర్యంలో కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ జువ్వాడి నర్సింగరావు జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు.అనంతరం తిరుమల గంగాధర్ మాట్లాడుతూ ఇలాంటి పుట్టినరోజు వేడుకలను మరెన్నో జరుపుకోవాలని, నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తిరుమల గంగాధర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నం అనిల్, పుప్పాల ప్రభాకర్, ఆడెపు మధు, జిందం లక్ష్మీనారాయణ, ఎంబేరి నాగభూషణం, సంఘ లింగం, మోర్తాడ్ లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.