ముద్ర, శేరిలింగంపల్లి:
త్రాగునీటి సమస్య పరిష్కారం కోసం ప్రత్యేక చర్యలు చేపడుతూ, నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడకుండా హై ప్రెజర్ బూస్టర్ ను నల్లగండ్ల ఫ్లైఓవర్ వద్ద ఏర్పాటు చేసి ప్రారంభించిన శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్. శేరిలింగంపల్లి డివిజన్ లోగల గోపినగర్, నెహ్రూనగర్, బాపునగర్ మరియు పలు బస్తీలలో గత కొంత కాలంగా లోప్రెషర్ త్రాగు నీరు వస్తున్నాయని, తమకు హై ప్రెషర్ త్రాగునీటి సదుపాయం కల్పించాలని బస్తీ వాసులు కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ కోరారు. స్పందించిన కార్పొరేటర్ తక్షణ చర్యలు చేపట్టి బస్తివాసులకు మెరుగైన త్రాగునీటి సదుపాయం కల్పించాలనే సంకల్పంతో ప్రత్యేక చొరవ తీసుకుని అధికారులతో చర్చించి గోపినగర్ గుట్ట ప్రాంతంలో, నెహ్రూ నగర్ పరిసర బస్తీ వాసులకు హై ప్రెషర్ త్రాగునీటి సదుపాయం కొరకు ‘బూస్టర్’ ను అందుబాటులోకీ తీసుకువచ్చి ప్రారంభించారు.ఈ సందర్బంగా కార్పొరేటర్ మాట్లాడుతూ డివిజన్ లో మౌలిక సదుపాయాలు కల్పించాలనే లక్ష్యంగా పనిచేస్తున్నామని అందులో భాగంగా లోప్రెషర్ త్రాగు నీటి సమస్యను ఆదిగమించామని పేర్కొన్నారు. డివిజన్ ను ఆదర్శవంతమైన డివిజన్ గా తీర్చిదిద్దామని అన్నారు. ఏ సమస్య ఉన్న తన దృష్టికి తీసుకురావాలని తక్షణమే సమస్యలను సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. గోపినగర్, నెహ్రూనగర్ తదితర బస్తీ వాసులు కార్పొరేటర్ హై ప్రెషర్ త్రాగునీటి కోసం ఎంతగానో కృషి చేశారని వారికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ డిజిఎం నరేందర్, వాటర్ వర్క్స్ మేనేజర్ అభిషేక్ రెడ్డి, డివిజన్ గౌరవ అధ్యక్షులు వీరేశం గౌడ్, ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్, సీనియర్ నాయకులు యాదా గౌడ్, వార్డు మెంబర్ పర్వీన్ బేగం, గఫుర్, విష్ణువర్ధన్ రెడ్డి, కొయ్యడ లక్ష్మణ్, యాదవ్, రవి యాదవ్, రాజ్ కుమార్, నరసింహ రెడ్డి, శ్రీకాంత్, నరసింహ, మహేందర్ సింగ్, దస్తగిర్, షకీల్, సాయన్న, సత్యనారాయణ, రవి, ముంతాజ్ బేగం, రేణు, మహేష్ చారీ, సలీం, సాయి, మహేష్, స్థానిక మహిళలు తదితరులు పాల్గొన్నారు.
Naresh is a Asst Editor and he is working with our organisation and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.