- అచ్చంపేట డా. చిక్కుడు వంశీకృష్ణ గారి ఆదేశాల మేరకు
ముద్ర,అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో స్థానిక ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి కాంగ్రెస్ కార్యకర్తలు అభిమానులు పూలమాల వేసిన ఘనంగా నివాళులర్పించారు.మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు మాట్లాడుతూ జ్యోతిరావు పూలే సామాజిక ఉద్యమకారుడు, సంఘసంస్కర్త, బలహీన వర్గాల అభ్యున్నతికై జీవితాన్ని ధారపోసిన మహనీయులు అని కొనియాడారు.సామాజిక సమానత్వం, మహిళా విద్యకు జ్యోతిరావు పూలే చేసిన కృషి తరతరాలు గుర్తించుకుంటాయన్నారు. ఈరోజు ఆ మహనీయుడి జయంతి సందర్భంగా వారికి ఇవే మా ఘన నివాళులు నినాదాలు చేశారుఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేందర్ మున్సిపల్ చైర్మన్ గార్లపాటి శ్రీనివాసులు,మాజీ ఎంపీపీ రామనాథం, కౌన్సిలర్ గౌరీ శంకర్, నాయకులు భరత్ కుమార్ , అనిల్, మల్లికార్జున్, రాజ గోపాల్, పాండు, మహబూబ్ ఆలీ, రాజేష్, ప్రభాకర్, అనిల్,లాలు యాదవ్, మౌలానా ,మహేష్ , తదితరులు పాల్గొన్నారు.