Take a fresh look at your lifestyle.

కొండాపూర్ ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన రాష్ట్ర వైద్య,ఆరోగ్యశాఖ కమిషనర్ సంగీత సత్యనారాయణ

 

134 వైద్యసేవలను ప్రజలకు అందుబాటులో ఉండేలా తక్షణ చర్యలు తీసుకోండి

జిల్లా వైద్యాధికారులకు కమిషనర్ ఆదేశం

(ముద్ర, ఉమ్మడి రంగారెడ్డిజిల్లా ప్రతినిధి):

రంగారెడ్డి జిల్లా కొండాపూర్ ప్రభుత్వాసుపత్రిని గురువారం రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ సంగీత సత్యనారాయణ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె తెలంగాణ డయాగ్నస్టిక్ జిల్లా హక్కు అందిస్తున్న పరీక్షలకు సంబంధించి క్షుణ్ణంగా వైద్యులచే సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ సంగీత సత్యనారాయణ మాట్లాడుతూ.. ప్రజలకు 134 వైద్య పరీక్షలు సకాలంలో నిర్వహించి సరైన సమయంలో రిపోర్టులు అందించాలని ఆదేశించారు. అదేవిధంగా జిల్లాలోని ఆసుపత్రుల మాతా సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ప్రతి గర్భిణీకి ఎం సి హెచ్ పోటోల్లో నమోదు చేసి వారిని ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. అసంత్రి, అసంక్రమిత వ్యాధులైన రక్తపోటు, మధుమేహం సంబంధించిన రోగులకు సరైన మందులు, ఫాలోఅప్ నిర్వహించాలని వైద్యులను ఆదేశించారు వికలాంగులు ఆస్పత్రులకు సౌకర్యంగా వెళ్లేందుకు రైలింగ్ ర్యాంపు, వీల్ చైర్ల సౌకర్యాలు విధిగా ఉండాలని ఆదేశించారు. ఆస్పత్రుల్లో వర్షపునీటి సేకరణ గొయ్యి.. ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని ఆదేశించారు. బస్తీ దవఖానాల్లో వైద్యుల, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులను, యూపీఎస్సీలలో, ఐసిటీ సెంటర్లలో వెంటనే భర్తీ చేయాలని ఆదేశించారు. కొండాపూర్లో నిర్మాణంలో ఉన్న గ్రామ కేర్ సెంటర్ ను కమిషనర్ సంగీత సత్యనారాయణ పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. జిల్లాలోని 30% ఆసుపత్రులు జాతీయ నాణ్యతా ప్రమాణాల ఆమోదం పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ లలితాదేవి, కొండాపూర్ డిసిహెచ్ఎస్ డాక్టర్ అనురాగిణి, మెడికల్ సూపర్డెంట్ డాక్టర్ చంద్ర కృష్ణ, జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్లు, వైద్య ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.