క్రీడల్లో వీఎం హోమ్ విద్యార్థుల రాణింపు అభినందనీయం -రాష్ట్ర ఎస్సి సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
(ముద్ర, ఉమ్మడిరంగారెడ్డి జిల్లా ప్రతినిధి):
విద్యతో పాటుగా క్రీడల్లోనూ విద్యార్థులు రాణించడం అభినందనీయమని రాష్ట్ర షెడ్యూల్ కులాల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. గురువారం మంత్రి సరూర్నగర్ లోని వీ.ఎం.హోమ్ రెసిడెన్షియల్ పాఠశాలను సందర్శించి క్రీడా ప్రాంగణం నందు క్రికెట్ కోర్టును ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రతిష్టాత్మకమైన వీఎం హోమ్ పాఠశాలలోని ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బంది అంకిత భావంతో పని చేస్తున్నారని ప్రశంసించారు. ఈ పాఠశాల విద్యార్థులు విద్యాతో పాటుగా క్రీడా రంగంలోనూ మంచి ఫలితాలను సాధిస్తూ రాష్ట్ర స్థాయిలో గుర్తింపును పొందడం చాలా సంతోషంగా ఉందన్నారు.
ఈ సందర్భంగా పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులతో మంత్రి ముఖముఖిగా మాట్లాడి విద్యాపరంగా ఉపాద్యాయుల పనితీరును, వసతులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల తరగతి గదులను, కంప్యూటర్ ల్యాబ్ ను, లైబ్రరీ సందర్శించారు. అనంతరం వీ.ఏం. హోమ్ విద్యార్థినీ, విద్యార్థినిలతో కలిసి మంత్రి సంహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా బోజనం పట్ల, మెనూ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఇక్కడ పని చేస్తున్న ఉపాధ్యాయ ఉపాధ్యాయేతర సిబ్బందికి సంబందించిన సమస్యలను మంత్రికి వివరించగా సమస్యల పట్ల మంత్రి సానుకలంగా స్పందించారు.
ఈ కార్యక్రమంలో వి.ఏం.హోమ్ పాఠశాల కార్యదర్శి/డిడి సోషల్ వెల్ఫేర్ జే రామారావు, పాఠశాల ప్రిన్సిపాల్ సి నరసింహారెడ్డి, పాఠశాల సూపరింటడెంట్ శ లక్ష్మీపార్వతి, మరియు ఉపాద్యాయ, ఉపాద్యాయేతర సిబ్బంది పాల్గోన్నారు.