Take a fresh look at your lifestyle.

రహదారి వెడల్పు పనులు చేపట్టాలి: బీజేపీ నాయకులు

రామకృష్ణాపూర్, ముద్ర : స్థానిక విఠల్ నగర్ చెక్ పోస్ట్ నుంచి రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి వరకు పురప్రజల సౌకర్యార్థం రహదారి వెడల్పు పనులను చేపట్టాలని పట్టణ బీజేపీ నాయకులు కోరారు. శుక్రవారం క్యాతన్ పల్లి మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు కు వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రహదారి వెడల్పుతో పాటు ప్రమాదాల నివారణకు ఇరువైపుల విద్యుత్ లైట్లను ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఠాకూర్ ధన్ సింగ్,జిల్లా మాజీ ఉపాధ్యక్షుడు బంగారి వేణు,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెద్దపల్లి పురుషోత్తం, సీనియర్ నాయకులు సంజీవరావు, కార్యదర్శి ఎల్లేష్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.