ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల పట్టణంలో రజక సంఘం ఆధ్వర్యంలో బుధవారం వీరమ్మ బోనాల పండగ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని పలు వీధుల గుండా మడేళేశ్వర స్వామి విగ్రహంతో మహిళలు బోనం ఎత్తుకొని డప్పు చప్పులతో ఊరేగింపుగా శోభయాత్ర నిర్వహించారు. అనంతరం మహిళలు వీరమ్మ ఆలయానికి చేరుకొని అమ్మవారికి నైవేద్యం సమర్పించి పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో రజక సంఘ నాయకులు మహిళలు పాల్గొన్నారు.