- బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానుల శుభాకాంక్షలు వెల్లువ.
ముద్ర, ఇబ్రహీంపట్నం: బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు, ఇబ్రహీంపట్నం మాజీ శానసభ్యులు మంచిరెడ్డి కిషన్ రెడ్డి జన్మదిన వేడుకలు బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానుల నడుమ అట్టహాసంగా నిర్వహించారు.ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని ఎలిమినేడు గ్రామంలోని తన వ్యవసాయ క్షేత్రంలో కుటుంబ సభ్యుల సమక్షంలో ఆయనతో కేక్ కట్ చేయించగా జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.బీఆర్ఎస్ భువనగిరి పార్లమెంటు పార్టీ ఇంచార్జి క్యామ మల్లేష్, రాష్ట్ర నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి, బీఆర్ఎస్ యువజన విభాగం అధ్యక్షులు జెర్కోని రాజు, విద్యార్థి విభాగం అధ్యక్షులు మడుపు శివసాయి, నిట్టు జగదీశ్వర్ లు ఆయన్ను కలిసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.జన్మదిన వేడుకల్లో మాజీ మార్కెట్ చైర్మన్ చంద్రయ్య, మాజీ జడ్పీటీసీలు రమేష్ గౌడ్, జంగమ్మ యాదయ్య, మాజీ ఎంపీపీ కృపేశ్, మాజీ సర్పంచ్ రాజు నాయక్, బీఆర్ఎస్ నాయకులు పచ్చ భాష, కానుగుల మహేష్, పాతూరి రాజేష్, ఏనుగు భరత్ రెడ్డి, కరుణాకర్, మాజీ ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
