Take a fresh look at your lifestyle.

జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

మహేశ్వరం, ముద్ర ప్రతినిధి: మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాలాపూర్ చౌరస్తాలో మహనీయుడు జ్యోతిరావు పూలే జయంతిని పురస్కరించుకుని శుక్రవారం మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఘనంగా నివాళులు అర్పించారు. జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి, ఆయన సేవలను స్మరించుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, జ్యోతిరావు పూలే మహిళల అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేశారని, విద్యకు పెద్దపీట వేసి నూతన మార్గాలను చూపించారని కొనియాడారు.వారి ఆలోచనలకే కొనసాగింపుగా మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణలో 1000 గురుకులాల్ని ప్రారంభించారని, అందులో 600 గురుకులాలు ప్రత్యేకంగా బాలికల కోసం ఏర్పాటు చేశారని వెల్లడించారు.దండేసి దండం పెట్టడం కాదు ఆశయాన్ని సాధించినప్పుడే ఆయనకు అదే ఘన నివాళ అని అన్నారు.ఈ కార్యక్రమంలో మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ బిఆర్ఎస్ అధ్యక్షులు అర్కల కామేష్ రెడ్డి, దిండు భూపేష్ గౌడ్, సిద్దాల బీరప్ప, అర్కల భూపాల్ రెడ్డి, శీను నాయక్, దీప్లాల్ చౌహాన్, అనిల్ యాదవ్, రమేష్, విజయ్, దయానంద్, మహిళా అధ్యక్షురాలు సునీత, సుర్విలత తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.