Take a fresh look at your lifestyle.

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలి : జిల్లా కలెక్టర్ బి . సత్యప్రసాద్

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ పేర్కొన్నారు.బుధవారం ధర్మపురి పట్టణంలోని శ్రీలక్ష్మీనరసింహ స్వామి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను సంబంధిత అధికారులతో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.ఈ నెల 10,వ తేదీ నుండి 22,వరకు జరిగే బ్రహ్మోత్సవ ఏర్పాట్లు పై కలెక్టర్ స్వయంగా అధికారులతో కలిసి గోదావరి నది గాట్లను భక్తులకు స్నానమాచరించే పరిసరాలను పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గోదావరి నది తీరాన భక్తులకు ఇబ్బంది కలగకుండా లైట్స్,చలవ పందిర్లు ఏర్పాటు చేయాలని అన్నారు.మహిళలకు డ్రెస్ చేంజ్ రూములు, త్రాగునీరు,మొబైల్ టాయిలెట్స్ ,ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు.ఆలయ ప్రాంగణం,పరిసరాలలో నిత్యం శానిటేషన్ నిర్వహించాలని తెలిపారు.ఎంఎల్ఏ అడ్లురి లక్ష్మణ్ కుమార్ ప్రతిపాదించిన శ్రీ మట్టం లో 4 ఎకరాల ఖాలి స్థలంలో స్వామి వారి కళ్యాణానికి ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు.శ్రీ వారి కళ్యాణానికి కోసం దేవాలయ శాఖ అనుమతి తో కళ్యాణ వేదిక వద్ద కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.గత ఏడాది భక్తులు సుమారు 3లక్షల వరకు వచ్చారని ఈ సారి ఇంకో 10 శాతం భక్తులు పెరిగే అవకాశం ఉన్నందున సుమారు 4లక్షల వరకు వచ్చే అవకాశం ఉన్నందున కావాల్సిన అన్ని ఏర్పాట్లు లను సిద్దం చేయాలని ఆయా శాఖ అధికారులకు ఆదేశించారు.

అనంతరం ధర్మపురి మున్సిపల్ కార్యాలయంనీ అకస్మిక తనిఖీ చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించి పలు రికార్డులను దరఖాస్తులను పరిశీలించారు.ఎల్ ఆర్ ఆర్ దరఖాస్తులను పరిశీలించి,ఎంతమంది దరఖాస్తు చేసుకున్నారు,ఎంతమంది ప్రాసెస్ చేయబడ్డది,అని వివరాలు అడిగి తెలుసుకున్నారు.వాటిపై రివ్యూ నిర్వహించారు.అలాగే ఇంటి పన్ను వసూలు వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.ఇంక ఎంత మంది ఇంటి పన్ను చెల్లింపు చేసేవారు ఉన్నారు,వివరాలను ఆరా తీశారు.కచ్చితంగా 100 శాతం ఇంటి పన్ను వసూలు చేయాలని అధికారులకు ఆదేశించారు.కలెక్టర్ వెంట,టెంపుల్ ఈఓ శ్రీనివాస్, మున్సిపల్ ఇరిగేషన్ అధికారి నారాయణ, ఆర్ డబ్ల్యూఎస్ ఈ ఇ, డిప్యూటీ ఎమ్మార్వో సుమన్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.