Take a fresh look at your lifestyle.

ఆర్ఎంకు గంగుల వినతి పత్రం…

ముద్ర, కరీంనగర్ :
ఓ ఆర్టిసి డ్రైవర్ పై వేటు వేయడాన్ని ఖండించారు మాజీ మంత్రులు గంగుల కమలాకర్, జీవన్ రెడ్డి. జగిత్యాల ఆర్టీసి డ్రైవర్ ను విధుల నుండి తొలగించడాన్ని నిరసిస్తూ.. నేడు మాజీ మంత్రులు గంగుల కమలాకర్, జీవన్ రెడ్డిల ఆధ్వర్యంలో గులాబీ శ్రేణులు ఆందోళనబాట పట్టారు. తొలగించిన ఆర్టీసి డ్రైవర్ ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలంటూ ఆర్టీసి ఆర్ఎంకు వినతి పత్రాన్ని అందించారు. ప్రజా పాలన… ప్రభుత్వమంటూ అధికారంలోకి వచ్చిన… కాంగ్రెస్ ప్రభుత్వం… నియంతృత్వ పాలన కొనసాగిస్తుందన్నారు గంగుల. ధాన్యం కొనుగోలు అంశంపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఆర్టీసీ డ్రైవర్ అశోక్ సస్పెన్షన్ దుర్మార్గమన్నారు. సస్పెండ్ చేసిన ఆర్టీసీ డ్రైవర్ అశోక్ కు బి.అర్.ఎస్ పార్టీ అండగా ఉంటుందన్న గంగుల. డ్రైవర్ సస్పెన్షన్ ఎత్తివేసే వరకు అవసరమైతే అర్.ఏం కార్యాలయం ముందు బైఠాయిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించినంత మాత్రాన డ్రైవర్ అశోక్ సస్పెన్షన్ చేయడం సరికాదన్నారు. బి.అర్.ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తాత్కాలిక డ్రైవర్ గా ఉన్న అశోక్ ను పర్మినెంట్ డ్రైవర్ గా ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామి ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.