కోరుట్ల, ముద్ర విలేకరి: కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా బీసీ కులగణన నిర్వహించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న చారిత్రక నిర్ణయాన్ని స్వాగతిస్తూ శుక్రవారం రోజు కోరుట్ల పట్టణ అధ్యక్షులు బింగి వెంకటేశ్ ఆధ్వర్యంలో స్థానిక నంది చౌరస్తా వద్ద బిజేపీ నాయకులు మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ముఖ్యఅతిథిగా జగిత్యాల జిల్లా బిజెపి అధ్యక్షులు డాక్టర్ రాచకొండ యాదగిరి బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీల హక్కులను గుర్తించి ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం దేశవ్యాప్తంగా ప్రజల నుండి అభినందనలు అందుకుంటుందని, అన్ని వర్గాల పట్ల సమాన దృష్టి కోణం కలిగిన నాయకుడు కేవలం నరేంద్ర మోడీ అని, ప్రపంచ దేశాలకు మన ప్రధానమంత్రి ఆదర్శమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఓ బి సి రాష్ట్ర ఉపాధ్యక్షులు రుద్ర శ్రీనివాస్, పార్లమెంట్ కోకన్వీనర్ గుంటుక సదాశివ్, జిల్లా నాయకులు సుధవేణి మహేష్,, ఇందూరు తిరుమల వాసు, కస్తూరి లక్ష్మీనారాయణ, పట్టణ ప్రధాన కార్యదర్శి ఇట్యాల నవీన్, మాజీ కౌన్సిలర్ మాడవేని నరేష్, ఉపాధ్యక్షులు ఎర్ర రాజేందర్, కిసాన్ మోర్చా అధ్యక్షులు ఎల్లాల నారాయణరెడ్డి, కైరకొండ రాజగంగాధర్, మేకల గణేష్, తోట రాజేష్, అక్మల్ తాహెర్, తోట దుర్గాప్రసాద్, ఓం ప్రకాష్, ముల్క మణిరాజ్, గిన్నెల శ్రీకాంత్, బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.