Take a fresh look at your lifestyle.

ప్రజల సమస్యల పరిష్కారానికే గ్రీవెన్స్ డే ఎస్పీ జానకి షర్మిల

 

ముద్ర ప్రతినిధి, నిర్మల్:
ప్రజా సమస్యల పరిష్కారం సత్వరమే జరిగేందుకు గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు ఎస్పీ జానకి షర్మిల అన్నారు. జిల్లా పోలీసు ముఖ్య కార్యాలయంలో సోమవారం గ్రీవెన్స్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ జానకి షర్మిల మాట్లాడుతూ పోలీస్ సేవలు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా, ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయడం జరుగుతుందన్నారు.పోలీస్ అధికారులు, సిబ్బంది పోలీస్ స్టేషన్ కి వచ్చిన ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా ప్రవర్తించాలన్నారు. ఫిర్యాదులు స్వీకరించి క్షేత్ర స్థాయిలో పరిశీలించి చట్ట ప్రకారం బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. తద్వారా ఫిర్యాదుదారునికి పోలీస్ శాఖపై భరోసా, నమ్మకం కలుగుతుందన్నారు. గ్రీవెన్స్ డే లో వచ్చిన ఫిర్యాదులు ఆన్ లైన్ లో పొందుపరుస్తూ ఏ మేరకు పరిష్కారం అయ్యాయో అని ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ప్రజలకు మరింత సమర్ధవంతంగా సేవలందించడం జరుగుతుందన్నారు.

Leave A Reply

Your email address will not be published.