Take a fresh look at your lifestyle.

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన 3 రైతు చట్టాలను రద్దు చేయాలి: సిపిఐ

ముద్ర, యాదగిరిగుట్ట :
కేంద్ర ప్రభుత్వం కార్పోరేట్ అనుకూల ప్రజా వ్యతిరేక విధానాలు అమలు చేస్తూ రైతుల హక్కులను కాలరాసే విధంగా మూడు రైతు చట్టాలను తీసుకొచ్చిందని వెంటనే రద్దు చేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కళ్లెం కృష్ణ, కొల్లూరు రాజయ్యలు డిమాండ్ చేశారు. సోమవారం మండలంలోని చొల్లేరు గ్రామంలో ఇంటింటికి సిపిఐ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బండి జంగమ్మ, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి పేరబోయిన మహేందర్, సిపిఐ మండల కార్యదర్శి కలేపల్లి మహేందర్, రైతు సంఘం నాయకులు పేరబోయిన బంగారు, సిపిఐ నాయకులు మీసాల దాసు, ఈదులకంటి బక్కయ్య, ఉపేంద్ర పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.