ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :
చంద్లాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2005- 06 లో పదవ తరగతి పూర్తి చేసుకున్న పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం జరుపుకున్నారు. 20 సంవత్సరాల తర్వాత మళ్లీ అందరూ తాము చదువుకున్న పాఠశాలలో కలుసుకోవడంతో చిన్నపిల్లల్లా మారిపోయారు. ఈ సందర్భంగా పాఠశాలలో చదువుకున్న సమయంలో జరిగిన సంఘటనలను, తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు బాలనర్సయ్య, అబ్దుల్ అజీజ్, విష్ణువర్ధన్, లక్ష్మయ్య, వరప్రసాద్, విద్యార్థులు పవన్, బి.నరేష్, వెంకట్, అంజి, సంతోష్, ఎ.నరేష్, స్వామి, అనిల్, నరేన్, కిషన్, పి.స్వాతి, నాగరాణి, పద్మ, లావణ్య, డి.స్వాతి, s. రమ్య, డి.రజిత, బి. రమ్య, బి.రజిత, కవిత, మాధవి, శ్రీలత, తదితరులు పాల్గొన్నారు.