Take a fresh look at your lifestyle.

ముఖ్యమంత్రి ప్రకటించిన వేతనాల పెంపులో శాస్త్రీయత లేదు

 

* వేతనాలు పెంచడం అంటే కోత విధించడమేనా

* ప్రస్తుతం ఉన్న వేతనలకన్నా తగ్గుతున్నాయి

* CITU జిల్లా కార్యదర్శి కాముని గోపాలస్వామి

ముద్ర ప్రతినిధి, సిద్దిపేట :

ముఖ్యమంత్రి ప్రకటించిన వేతనాల పెంపులో శాస్త్రీయత లేదనీ CITU జిల్లా కార్యదర్శి కాముని గోపాల స్వామి
విమర్శించారు.శుక్రవారం CITU సిద్దిపేట జిల్లా కార్యాలయంలో సమావేశం జిల్లా అధ్యక్షులు సందబోయిన ఎల్లయ్య అధ్యక్షతన జరిగింది.ఈ సమావేశానికిలో CITU జిల్లా కార్యదర్శి గోపాలస్వామి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కనీస వేతనాల పెంపుదల శాస్త్రీయంగా లేదని విమర్శించారు. దాదాపు 14 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వేతనాలు సవరించడం సానుకూల పరిణామమే అయినప్పటికీ, పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికులు, కార్మిక సంఘాలు చేసిన డిమాండ్లను ప్రభుత్వం పూర్తిగా పక్కనబెట్టడం తీవ్ర అసంతృప్తిని కలిగిస్తోందని అన్నారు. రాష్ట్రంలో కనీస వేతనాలను 3 జోన్లు (మున్సిపల్ కార్పొరేషన్స్, మున్సిపాలిటీలు, గ్రామీణ ప్రాంతాలు) గా విభజించి వేర్వేరుగా ప్రకటించడాన్ని, అలాగే బేసిక్ కరువుభత్యాన్ని (DA) సరిగ్గా పరిగణనలోకి తీసుకోకపోవడాన్ని CITU తీవ్రంగా వ్యతిరేకిస్తోందని స్పష్టం చేశారు. ఇప్పటికే GO 4, GO11ప్రకారం పొందుతున్న వేతనాల కన్నా తక్కువ నిర్ణయించడంసిగ్గుచేటు. 2020- 2021 సంవత్సరం ​గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కనీస వేతనాల సలహామండలి బోర్డు ఒక అన్‌స్కిల్డ్ కార్మికుడికి రూ. 18,019/- కనీస వేతనం ఇవ్వాలని సిఫార్సు చేసిందని, కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దానికి భిన్నంగా నేడు16000/- మాత్రమే ప్రకటించడం అన్యాయమన్నారు.
పెరిగిన ధరలు, 1948 కనీస వేతనాల చట్టం, డాక్టర్ అక్రోయిడ్ ఫార్ముల సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం శాస్త్రీయంగా లెక్కిస్తే కనీస వేతనం రూ. 32,000/- ఇవ్వాలని కానీ ప్రస్తుత పరిస్థితులలో కార్మికుల ప్రయోజనాల దృష్ట్యా కనీస వేతనాన్ని రూ. 26,000/- లుగా నిర్ణయించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తక్షణమే కార్మిక సంఘాల డిమాండ్లను, సలహామండలి సిఫార్సులను పరిగణనలోకి తీసుకొని ఈ వేతనాల పెంపును సవరించాలని ఆయన డిమాండ్ చేశారు.​ఈ సమావేశంలో CITU జిల్లా సహాయ కార్యదర్శి చొప్పరి రవికుమార్, మామిడాల కనకయ్య కాట మధు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.