Take a fresh look at your lifestyle.

ఏసీబీకి పట్టుబడ్డ నర్సాపూర్ ఏడీఈ

ముద్ర ప్రతినిధి, మెదక్:
మెదక్ జిల్లా నర్సాపూర్ విద్యుత్ సబ్ డివిజన్ ఆపరేషన్స్ అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ ఏసీబీకి చిక్కారు. నర్సాపూర్ పట్టణంలోని విద్యుత్ ఏడీ కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ ఆధ్వర్యంలో అధికారుల దాడులు చేశారు. ఓ కాంట్రాక్టర్ నుంచి రూ.25 వేల డబ్బులు తీసుకుంటుండగా ఏడీఈ ఎంవీ రమణ రెడ్డిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏడీఈ ఎం.వి. రమణారెడ్డి తన విధుల్లో నిర్లక్ష్యం వహించినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. చెందిన రూ. 3,13,882 విలువైన 11 వర్క్ బిల్లుల మంజూరుకు లంచం డిమాండ్ చేశారు.
రమణారెడ్డిని విచారణ కోసం రెండవ అదనపు ప్రత్యేక న్యాయమూర్తి కోర్టు ముందు హాజరుపరచడం జరుగుతోందన్నారు.
ఫోన్ నంబర్ 1064కు కాల్ చేయండి
ఏదైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం డిమాండ్ చేసిన సందర్భంలో, చట్ట ప్రకారం చర్య తీసుకోవడానికి ప్రజలు ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ అయిన 1064ను సంప్రదించాలని ఏసీబీ డిఎస్పీ సుదర్శన్ సూచించారు. తెలంగాణ ఏసీబీ సంప్రదింపు వివరాల కోసం ఏసీబీ క్యూఆర్ కోడ్ అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రముఖ బహిరంగ ప్రదేశాలలో ప్రదర్శించబడుతుందన్నారు. బాధితుడు/ఫిర్యాదుదారుని వివరాలు గోప్యంగా ఉంచబడతాయన్నారు.

Leave A Reply

Your email address will not be published.