Take a fresh look at your lifestyle.

అలరించిన హిందూస్తాని గాత్రం

మాదాపూర్, ముద్ర విలేఖరి: శిల్పారామం మాదాపూర్ లో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగంగా ఈరోజు ఫ్యూషన్ స్కూల్ అఫ్ మ్యూజిక్ అండ్ డాన్స్ విద్యార్థులు హిందుస్తానీ గాత్రం , కథక్ మరియు భరతనాట్య ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి. హిందుస్తానీ గాత్రం లో రాగ్ యమన్, రాగ్ దుర్గ, రాగ్ భైరవి మొదలైన రాగాలను దృశ్య, ఇషాన్వి, ఆరుషి, దియా, దర్శిని మొదలైనవారు గీతాలాపన కావించారు. కథక్ నృత్య ప్రదర్శనలో దుర్గ స్తుతి, హోలీ, తరణ తీన్తాల్ అంశాలను చవి, శ్రియ, షీలా, ఖుషి, తనిష్క, బియాంకా మొదలైనవారు ప్రదర్శించారు. భరతనాట్య ప్రదర్శనలో శ్లోకాంజలి, సరస్వతి పుష్పాంజలి, పదం , తిల్లాన అంశాలను సాక్షి, అధ్య, వైభవి, మీరా , ఆకాంక్ష , సహస్ర లు ప్రదర్శించి మెప్పించారు.

Leave A Reply

Your email address will not be published.