Take a fresh look at your lifestyle.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి కేటీఆర్ కు లేదు-కేటీఆర్ పై విరుచుకపడ్డ ఎమ్మెల్యే మందుల సామెల్

 

* ప్రజల విశ్వాసంతో సీఎంగా ఎదిగిన రేవంత్ రెడ్డి

* విమర్శలకంటే అభివృద్ధి పనులపై దృష్టి పెట్టాలి

* మీరు కట్టిన ప్రాజెక్టులలో మీ కుటుంబానికి ఎంత వాట ఉందో చెప్పాలి

* ప్రభుత్వాన్ని, సీఎంను విమర్శిస్తే రాజకీయంగా వేటాడి సమాధి కడతాం

 

ముద్ర ,తుంగతుర్తి…

రాష్ట్రంలో ప్రజా పాలన అప్రతిహతంగా కొనసాగుతుందని ప్రజా సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయని అభివృద్ధి చేస్తున్న సీఎం రేవంత్ రెడ్డిని విమర్శించే స్థాయి కేటీఆర్ కు లేదని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ మండిపడ్డారు. బుధవారం మండల కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయం ముందు మీడియాతో మాట్లాడుతూ… పదేళ్లు బిఆర్ఎస్ పాలనలో రైతులను నయవంచన చేసిన నాయకులే నేడు రైతు సమరభేరి పేరుతో సభలు పెట్టడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. మీ ప్రభుత్వ హయాంలో కట్టిన ప్రాజెక్టులలో మీ కుటుంబ సభ్యుల కు ఎంత వాట ఉందో ప్రజల ముందు చెప్పాలని సవాల్ విసిరారు. నాడు మలిదశ తెలంగాణ ఉద్యమం కోసం అలుపెరగని పోరాటం చేసిన ఉద్యమకారులను అణిచివేసి వారిని దూరం పెట్టి మీ కుటుంబం పదవులు అనుభవించి తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం లూటీ చేసిందని విమర్శించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కేటీఆర్ కు తెలివి లేదని మాట్లాడిన వాటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తోడబుట్టిన చెల్లెనే తెలివి లేదు? సోయి లేదనీ విమర్శిస్తుంటే సమాధానం చెప్పలేని దద్దమ్మవు నువ్వు అని అన్నారు. ఏరోజైతే టిఆర్ఎస్ పార్టీని బిఆర్ఎస్ అని పెట్టారో ఆ రోజే మీరు మీ బొంద మీరే తొవ్వుకొని అందులో మీరు పడ్డారని అన్నారు. రైతులను కాపాడడానికి ప్రాజెక్టులు కట్టింది నాటి కాంగ్రెస్ ప్రభుత్వమని అన్నారు.రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని గాని.. రేవంత్ రెడ్డి పైన గాని ఆచితూచి మాట్లాడకుంటే ప్రజలు తగిన సమయంలో తగిన రీతిలో బుద్ధి చెప్తారని హెచ్చరించారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తీగల గిరిధర్ రెడ్డి, తుంగతుర్తి సింగిల్ విండో చైర్మన్ గుడిపాటి సైదులు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చింతకుంట్ల వెంకన్న, జిల్లా నాయకులు రేగటి రవి, వివిధ మండలాల సర్పంచులు,అధ్యక్షులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, యువజన సంఘాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.