Take a fresh look at your lifestyle.

ఈతరం శ్రీమంతుడు ఈయన.

ముద్ర. పరకాల. : జనం శ్రీమంతుడిని రీల్స్ లో చూసి ఉండవచ్చు… కానీ పరకాల మున్సిపాలిటీ పరిధిలోని విలీన గ్రామమైన సీతారాంపురం గ్రామంలో నిజమైన శ్రీమంతుడిని చూసినట్టుగా జనం భావిస్తారు. ఆ గ్రామంలోని నల్లెల్ల కుమార్ నిజ జీవితంలో శ్రీమంతుడి వలె మారి ప్రజలకు అవసరమైన పనులను చేస్తూ ప్రజల మెప్పును పొందుతున్నారు. ఎలాంటి పదవి ఆశించకుండానే గ్రామంలో పోచమ్మ మైసమ్మ ఆంజనేయస్వామి లాంటి దేవాలయాల నిర్మాణం తో పాటు ప్రజలకు అవసరమైన రోడ్లు కమ్యూనిటీ భవనాల నిర్మాణాలు చేసి ప్రజల మనసుల్లో చోటు సంపాదించుకున్నారు. గీతా కార్మికులకు వ్యవసాయదారులకు కూలీలకు అవసరమైన విధంగా రహదారుల నిర్మాణం చేపట్టి గ్రామంలో నీ ప్రజల మన్ననలను పొందారు.ఈయన ప్రస్తుతం విలీన గ్రామమైన సీతారాంపురం పరిధిలోని ఎనిమిదో వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తుండడం పట్ల ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎలాంటి పదవిని లేకున్నప్పటికీ ప్రజల సేవలను అవసరాలను గుర్తించిన ఆయన ప్రజాప్రతినిధిగా అవతారం ఎత్తితే ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందడంతో పాటుగా ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటాడని ప్రజలు భావిస్తున్నట్లు తెలిసింది. ఆయన ను ప్రజాపక్షం పలకరించగా తనను ఎనిమిదో వార్డ్ కౌన్సిలర్ గా సీతారాంపురం గ్రామ ప్రజలు గెలిపించినట్లయితే ఈ వార్డును స్థానిక శాసనసభ్యుడు నిద్రతోపాటు తన సొంత నిధులను తో వార్డును మరింత అభివృద్ధి చేసి ప్రజల హృదయాలలో చోటు సంపాదించుకుంటానని నల్లెల్ల కుమార్ తెలిపారు. తనపై నమ్మకంతో ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని ఆయన సంపూర్ణ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. గ్రామంలో ప్రజల అవసరాలను గుర్తించి పనిచేస్తున్న సమయంలో కొన్ని పార్టీలు తనపై అనేక రకాలైన వేధింపులకు పాల్పడ్డాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు పరకాల శాసనసభ్యుడు ప్రకాష్ రెడ్డి గ్రామంలో తన చేస్తున్న సేవలను గుర్తించి పిలిచి తనకు టికెట్ కేటాయించారని నల్లెల్ల కుమార్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.