- జిల్లా అధ్యక్షులు బోయిని పద్మాకర్.
గొల్లపల్లి, ముద్ర : జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి మండలం కేంద్రంలో గల రెడ్డి పంక్షన్ హల్ లో జిల్లా విశ్వహిందూ పరిషత్ గోరక్ష ఆధ్వర్యంలో ఈ నెల 20న ఆదివారం జరగబోవు విభాగ (జోనల్) స్థాయి సమావేశానికి ముఖ్యఅతిధిలు గా అఖిల భారత గోరక్ష సహ ప్రముఖ్ ఆకారపు కేశవ రాజు, రాష్ట్ర గోరక్ష ప్రముఖ్ ఇసంపల్లి వెంకన్న అలాగే ఆరు జిల్లాలకు సంబంధించిన గోరక్ష ప్రముఖులు పాల్గొంటారని జిల్లా అధ్యక్షులు బోయిని పద్మాకర్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల కేంద్రంలో జరుగుతున్న సమావేశానికి చుట్టుపక్కల గ్రామాలకు సంబంధించిన గో భక్తులు,సేంద్రియ వ్యవసాయం చేస్తున్న రైతులు అందరూ పాల్గొనాలని ఆయన తెలిపారు.ఈనెల 20న మండల కేంద్రంలో జరిగే కరీంనగర్ విభాగ్ స్థాయి గోరక్ష గోఆధారిత వ్యవసాయం పై యువ రైతులకు అవగాహన కల్పించి గోవంశ రక్షణ గురించి తెలియజేస్తారని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గజం రాజు, జిల్లా గోరక్ష ప్రముఖ్ ఆడెపు నరేష్,విశ్వహిందు పరిషత్ మండల అధ్యక్షులు కుభకార్ అరుణ్,మండల గోరక్షా ప్రముఖ్ జంగిలి సత్యం,సహా ప్రముఖ్ కోట తిరుపతి,ప్రచార ప్రముఖ్ సమిండ్ల సత్యం,ప్రధాన కార్యదర్శి ఆవుల వెంకటేష్ యాదవ్,మండల కన్వీనర్ ఎనగందుల రమేష్,శివ,శాతాల లక్ష్మణ్, ఉస్కమల్ల సత్యం పోచమల్లు తిరుపతి, ఉమేష్ యాదవ్,తదితరులు పాల్గొన్నారు.