Take a fresh look at your lifestyle.

రెండు కోట్ల రూపాయల విలువ చేసే కళ్యాణ లక్ష్మి- షాదిముబారక్ చెక్కుల పంపిణీ

మాదాపూర్, ముద్ర విలేఖరి: సుమారు రెండు కోట్ల విలువ చేసే కళ్యాణ లక్ష్మి-షాదిముబారక్ చెక్కులను 193 మంది లబ్ది దారులకు పీయేసీ ఛైర్మన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ పంపిణీ చేశారు.శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని కొండాపూర్, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, మాదాపూర్, మియాపూర్, హఫీజ్ పేట్, చందానగర్, భారతి నగర్(పార్ట్) డివిజన్ల పరిధిలోని పలువురికి కల్యాణ లక్ష్మి-షాదిముబారక్ పథకం ద్వార మంజూరైన 193 మంది లబ్ధిదారులకు రూ.1,93,22,388 ల చెక్కులను మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, మంజుల రఘునాథ్ రెడ్డి, నార్నె శ్రీనివాసరావు తో కలిసి చెక్కుల రూపేణా అరికెపూడి గాంధీ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ ఈ రోజు 193 మంది లబ్దిదారులకు కల్యాణ లక్ష్మీ షాది ముబారక్ చెక్కులు అందచేయడం చాలా సంతోషాన్ని కలిగిస్తోందని, పేదల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోందని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి పేదల పక్షపాతి అని, పేదింటి ఆడ బిడ్డకు పెద్ద అన్న లాగా నిలుస్తారని చైర్మన్ గాంధీ కొనియాడారు. నిరుపేద అడ బిడ్డల పెళ్లికి దేశంలో ఎక్కడా లేని విధంగా మానవతా దృక్పథంతో కల్యాణ లక్ష్మీ షాది ముబారక్ పథకం అమలు జరుగుతోందని, అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని గాంధీ కోరారు.ఈ కార్యక్రమంలో ఆర్.ఐ శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్లు, మాజీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు, మరియు లబ్ధిదారులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.