Take a fresh look at your lifestyle.

మహనీయుల ఆశయాలతో ముందుకు సాగాలి : ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, భువనగిరి :
మహనీయుల ఆశయాలను మనమంతా ముందుకు తీసుకుని వెళ్లాలని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలను షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో స్థానిక ప్రిన్స్ చౌరస్తా వద్ద గల జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఏమ్మెల్యే, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు, రెవిన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డిలతో కలిసి విగ్రహానికి పూలమాలలు వేసి, ఘనంగా నివాళులర్పించారు.
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు మాట్లాడుతూ బాబూ జగ్జీవన్ రాం ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రత్యేకించి యువతరం, విద్యార్థుల్లో స్ఫూర్తిని పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. దేశ భవిష్యత్తు కోసం, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు జగ్జీవన్ రాం అందించిన సేవలు ప్రతి ఒక్కరికి ఆదర్శమని అన్నారు
రెవిన్యూ అదనపు కలెక్టర్ వెంకా రెడ్డి మాట్లడుతూ 1971 యుద్ద సమయంలో రక్షణ శాఖ మంత్రి గా పని చేశారని తెలిపారు. మన రాజ్యాంగం కల్పించిన అవకాశం మేరకే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని అన్నారు.
డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ నిరుపేదల ఆకలి తీర్చేందుకు వ్యవసాయ శాఖ మంత్రిగా హరిత విప్లవాన్ని ప్రోత్సహించా రని, అన్ని వర్గాల అభ్యున్నతికి ఆయన కృషి చేశారని తెలిపారు. రాజ్యాంగ సవరణ లో అణగారిన వర్గాలకు న్యాయం చేస్తూ అనేక మార్పులను జగ్జీవన్ రావ్ తీసుకొని వచ్చారని ఆయన తెలిపారు.
వివిధ ఎస్సీ సంఘాల నాయకులు, ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు,డా. బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమం లో భువనగిరి రెవిన్యూ డివిజనల్ అధికారి కృష్ణా రెడ్డి,జిల్లా షెడ్యూల్డ్ కులముల అభివృద్ధి అధికారి సాహితీ, మున్సిపల్ చైర్మన్ శ్రీవాణి రవికుమార్, వైస్ చైర్మన్ మంజుల వెంకటేశ్వర్లు, గ్రంథాలయ చైర్మన్ అవేజ్ చిస్తీ, మార్కెట్ కమిటీ చైర్మన్ రేఖ బాబురావు, షెడ్యూల్డ్ కులముల సంఘాల అధ్యక్షులు, కార్యదర్శులు, సభ్యులు, వివిధ ఎస్సీ సంఘాల నాయకులు, ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.